హోమ్ /వార్తలు /క్రీడలు /

వాళ్ళను చూసి భయపడ్డ గంగూలీ... 22 సార్లు కరోనా పరీక్షలు

వాళ్ళను చూసి భయపడ్డ గంగూలీ... 22 సార్లు కరోనా పరీక్షలు

laxman-ganguly

laxman-ganguly

కోవిడ్ 19 లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ఐపీఎల్ 2020 ఈవెంట్‌ను బీసీసీఐ విజయవంతం చేసింది. అయితే టోర్నీకోసం బోర్డు తీసుకున్న చర్యలను బీసీసీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తాజగా వివరించారు.


కోవిడ్ 19 లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ఐపీఎల్ 2020 ఈవెంట్‌ను బీసీసీఐ విజయవంతం చేసింది. అయితే టోర్నీకోసం బోర్డు తీసుకున్న చర్యలను బీసీసీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తాజగా వివరించారు. కరోనా వైరస్ లాంటి తీవ్రమైన ప్రతికూల పరిస్థితిలో జాగ్రత్తలు తీసుకుంటూ లీగ్‌ను ముగించామంటూ సంతోషం వ్యక్తం చేశారు అలాగే కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఐపీఎల్‌-2020ను విజయవంతంగా ముగించడం గర్వంగా ఉందన్నారు

ఇనాళ్ళు ఐపీఎల్‌‌తో బిజీగా ఉన్న గంగూలీ.. ఇప్పుడు ప్రతిష్టాత్మికమైన ఆస్ట్రేలియా పర్యటనపై దృష్టి సాధించారు. మంగళవారం వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడిన దాదా... తను గత నాలుగున్నర నెలల్లో 22 సార్లు పరీక్షలు చేయించుకున్నానన్నారు. కరోనా ఉధృతి కారణంగా అన్ని సార్లు టెస్ట్‌ చేయించుకోవాల్సి వచ్చింది అన్నారు. ప్రస్తుతం మా కుటుంబంలో పెద్దవాళ్లైన తల్లిదండ్రులు ఉన్నారు. అందువల్ల చాలా కేర్ తీసుకోవాల్సివచ్చిందన్నారు. మొదట్లో చాలా భయపడ్డా. ఆ తర్వాత మెల్గమెల్లగా పరిస్థితులు చక్కబడ్డాయి. మనం తప్పలు వల్ల చుట్టూ ఉన్నవారికి తన వల్ల వైరస్‌ సోకకూడదుకదా అంటూ పలు విషయాలను వెల్లడించారు.

ఇక టీం ఇండియా.. ఆస్ట్రేలియాతో మూడు నెలల పాటు సుదీర్ఘ సిరీస్ ఆడనుంది . నవంబరు 27 నుంచి మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులను భారత జట్టు ఆడనుంది. ఇక రెండు నెలలపాటు ఈ సుదీర్ఘ పర్యటన కొనసాగునుంది. తొలి టెస్టు అడిలైడ్‌లో డిసెంబర్‌ 17 నుంచి 21 వరకు జరగుతుంది. ఈ టెస్ట్ తర్వాత కోహ్లి భారత్‌కు తిరిగి వస్తాడు. ఇక ఈ పర్యటన విషయానికి వస్తే మూడు వన్డే మ్యాచ్‌లు,మూడు టి20 మ్యాచ్‌లు,ఐదు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిలో కోహ్లి సిడ్నీ (జనవరి 7 నుంచి 11), బ్రిస్బేన్‌ (15 నుంచి 19)లలో జరిగే మూడో, నాలుగో టెస్టులకు దూరంమవుతాడు.

First published:

Tags: Cricket, IPL 2020

ఉత్తమ కథలు