
Gagnguly-Sachin (Photo Credit : Twitter)
Sourav Ganguly : గంగూలీకి ఆస్పత్రిలో చేరారన్న వార్త వినగానే భారత క్రికెటర్లు, మాజీ క్రికెటర్లతో పాటు అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు.
గంగూలీకి ఆస్పత్రిలో చేరారన్న వార్త వినగానే భారత క్రికెటర్లు, మాజీ క్రికెటర్లతో పాటు అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఇప్పటికే కోహ్లీ, రహనే, హార్భజన్ వంటి క్రికెటర్లు దాదా కోలుకోవాలని ట్వీట్లు చేశారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా గంగూలీ కోలుకోవాలని ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించాడు. "ఇప్పుడు గంగూలీకి గుండెపోటు వచ్చినట్లు వార్త విన్నాను. రోజులు గడిచే కొద్ది గంగూలీ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను" సచిన్ భావోద్వేగపు ట్వీట్ చేశాడు.టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసుపత్రిలో చేరారు. శనివారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి ఒక్కసారిగా ఛాతీనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆయన కోల్కతాలోని వుడ్ల్యాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ సర్జరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. గంగూలీకి ఎలాంటి ప్రమాదం లేదని సమాచారం. ప్రస్తుతం దాదా ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్యుల చికిత్సకు రెస్పాంట్ అవుతున్నట్లు వుడ్ ల్యాండ్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ రూపాలీ బసు తెలిపారు. ప్రస్తుతం గంగూలీకి రెండు స్టెంట్లు వేసినట్లు డాక్టర్లు తెలిపారు. 24 గంటల తర్వాత మరో రెండు స్టెంట్లు వేయనున్నట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గంగూలీ పరామర్శించడానికి ఆస్పత్రిను వెళ్తున్నట్లు తెలుస్తోంది. గంగూలీకి మెరుగైన చికిత్స అందించాలని ఆస్పత్రిని ఆదేశించారు బెంగాల్ గవర్నర్.
Published by:Sridhar Reddy
First published:January 02, 2021, 17:39 IST