HOME »NEWS »SPORTS »sourav ganguly health news live health updates virat kohli wishes for speedy recovery of bcci president srd

Sourav Gnanguly : గంగూలీ హెల్త్ అప్ డేట్స్.. కాసేపట్లో హెల్త్ బులిటెన్ విడుదల

Sourav Gnanguly : గంగూలీ హెల్త్ అప్ డేట్స్.. కాసేపట్లో హెల్త్ బులిటెన్ విడుదల
SOURAV GANGULY ( ఫైల్ ఫోటో)

Sourav Gnanguly : టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసుపత్రిలో చేరారు. శనివారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి ఒక్కసారిగా ఛాతీనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ సర్జరీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

  • Share this:
    టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసుపత్రిలో చేరారు. శనివారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి ఒక్కసారిగా ఛాతీనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ సర్జరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. గంగూలీకి ఎలాంటి ప్రమాదం లేదని సమాచారం. ప్రస్తుతం దాదా ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్యుల చికిత్సకు రెస్పాంట్ అవుతున్నట్లు వుడ్ ల్యాండ్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ రూపాలీ బసు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు డోస్ లు అందిస్తున్నట్లు తెలిపారు.

    " శనివారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి ఒక్కసారిగా ఛాతీనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బీపీ, పల్స్ లిమిట్స్ కంట్రోల్ లో ఉన్నాయ్. మైల్డ్ హార్ట్ ఎటాక్ తో అతడు బాధపడుతున్నాడు. . యాంజియోప్లాస్టీ సర్జరీ కి ముందు అవసరమైన చికిత్స అందిస్తున్నాం. సాయంత్రం ఐదు గంటలకు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తాం" అని వుడ్ ల్యాండ్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ రూపాలీ బసు తెలిపారు.




    గంగూలీకి ఆస్పత్రిలో చేరారన్న వార్త వినగానే భారత క్రికెటర్లు, మాజీ క్రికెటర్లతో పాటు అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. గంగూలీ కుటుంబానికి, అతని భార్య డోనా గంగూలీకి అండగా నిలబడానికి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు.ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ.. గతంలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. కెప్టెన్‌గా సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. గంగూలీ హయాంలో భారత జట్టు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందుకుంది.
    Published by:Sridhar Reddy
    First published:January 02, 2021, 16:18 IST