• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • SOURAV GANGULY GETS HEART ATTACK ADMITTED IN KOLKATA WOODLAND HOSPITAL NAGMA AND OTHERS WISH FOR HIS SPEEDY RECOVERY BA

Sourav Ganguly: సౌరవ్ గంగూలీకి హార్ట్ ఎటాక్, నగ్మా ప్రార్థనలు

Sourav Ganguly: సౌరవ్ గంగూలీకి హార్ట్ ఎటాక్, నగ్మా ప్రార్థనలు

నగ్మా, గంగూలీ (File)

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హార్ట్ ఎటాక్ రావడంతో క్రీడావర్గాలతో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారు కూడా వేగంగా స్పందిస్తున్నారు. సౌరవ్ గంగూలీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు నగ్మా కూడా సౌరవ్ గంగూలీ వేగంగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు.

  • Share this:
    బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హార్ట్ ఎటాక్ రావడంతో క్రీడావర్గాలతో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారు కూడా వేగంగా స్పందిస్తున్నారు. సౌరవ్ గంగూలీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు నగ్మా కూడా సౌరవ్ గంగూలీ వేగంగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. ‘సౌరవ్ గంగూలీ త్వరగా కోలుకోవాలి. గెట్ వెల్ సూన్. ప్రార్థిస్తున్నా.’ అంటూ నగ్మా ట్వీట్‌లో పేర్కొన్నారు. సౌరవ్ గంగూలీకి హార్ట్ ఎటాక్ రావడంతో ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కోల్‌కతాలోని వుడ్ లాండ్ ఆస్పత్రిలో ప్రస్తుతం సౌరవ్ గంగూలీ చికిత్స పొందుతున్నాడు. ఈ రోజు సాయంత్రానికి అతడికి ఆంజియో ప్లాస్టీ చికిత్స చేయనున్నట్టు తెలిసింది. జిమ్‌ చేస్తుండగా గంగూలీకి గుండె చిక్కబట్టినట్టు అనిపించింది. దీంతో జిమ్ ఆపేశాడు. వెంటనే ఆస్పత్రికి వెళ్లాడు. గంగూలీకి అందిస్తున్న చికిత్సపై వుడ్ లాండ్ ఆస్పత్రి నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే, ఇతర వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం గంగూలీ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని తెలిసింది.

    ‘గంగూలీకి ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆంజియో ప్లాస్టీ అవసరం కావొచ్చు.’ అని ఆయన సన్నిహిత వర్గాలు ఏఎన్ఐ వార్తాసంస్థతో చెప్పాయి. గత వారం సౌరవ్ గంగూలీ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌కు వెళ్లాడు. అక్కడ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నమెంట్ ఏర్పాట్లను పరిశీలించాడు. కరోనా తర్వాత జరుగుతున్న మొదటి క్రికెట్ టోర్నమెంట్ కావడంతో అక్కడ ఏర్పాట్లపై గట్టి చర్యలు తీసుకుంటున్నారు.



    గంగూలీకి హార్ట్ ఎటాక్ అని తెలిసిన వెంటనే చాలా మంది సెలబ్రిటీలు దాదా కోలుకోవాలంటూ ట్వీట్లీ చేస్తున్నారు.గంగూలీకి త్వరగా కోలుకోవాలని ప్రార్థస్తున్నట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారు.


    దాదా కి గుండెపోటు వచ్చిందన్న వార్త తనను బాధించిందని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మాజీ క్రికెటర్ హార్భజన్ సింగ్ ట్వీట్ చేశారు.


    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు