Sourav Ganguly Punches: గంగూలీతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. స్టాండుకు నా పేరా.. గ్రౌండే నాది భాయ్..

గంగూలీ వేసని ఈ పంచ్‌లు విన్నారా? తగ్గేదే ల్యా.. మామూలుగా ఉండదు మరి (PC: BCCI)

Sourav Ganguly Punches: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని బయట నుంచి చూసే వాళ్లు చాలా పొగరు, కోపం అని అనుకుంటారు. అయితే గంగూలీలో స్పాంటేనిటీ గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. అలాంటి కొన్ని సందర్భాలు ఇక్కడ చూద్దాం.

 • Share this:
  టీమ్ ఇండియా (Team India) కెప్టెన్లు అంటే అణిగిమణిగి... ప్రశాంతంగా ఉండాలనే సాంప్రదాయానికి చెల్లు చీటీ పాడిన క్రికెటర్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly). కోల్‌కతా ప్రిన్స్ అని పిలవబడే గంగూలీ యాటిట్యూడ్ గురించి ఎంతో మంది కథలు కథలుగా చెబుతుంటారు. చిన్నప్పటి నుంచి అలా ఉండే గంగూలీలో అగ్రెషన్‌తో పాటు వ్యంగ్యం కూడా బాగానే వంటబట్టింది. మైదానంలో ఎంత అగ్రెసీవ్‌గా ఉంటాడో.. బయట తన పంచ్‌లతో ఎదుటి వారిని పడేస్తుంటాడు. ఎదుటి వ్యక్తి ఎంతడి గొప్పోడైనా.. పెద్దోడైనా గంగూలీ పంచ్ విసిరితే నోరు మూసుకోవాల్సిందే. లార్డ్స్‌లో (The Lord's) షర్ట్ విప్పేసి సంబరాలు చేసుకున్నా.. మైదానంలో తోటి క్రికెటర్‌నే స్లెడ్జ్ చేసినా.. ఆఖరుకు కోచ్‌తో విభేదాలు వచ్చినా.. గంగూలీ మ్యాటర్ అంతా చాలా డిఫరెంట్. అందుకే దాదా దగ్గర పంచ్‌లు వేయాలంటే చాలా మంది భయపడుతుంటారని సన్నిహితులు చెబుతారు.

  ఒకసారి గంగూలీ ఏకంగా రవిశాస్త్రికే పంచ్ విసిరాడు. ఈడెన్ గార్డెన్‌లో మ్యాచ్ జరుగుతుండగా.. కామెంట్రీ బాక్సులో కూర్చొని ఉన్నప్పుడు రవిశాస్త్రి - గంగూలీ మధ్య ఒక సంభాషణ జరిగింది. వాళ్లిద్దరూ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటూ.. ఈడెన్ గార్డెన్ ప్రస్తావన వచ్చింది. అప్పుడు రవిశాస్త్రి 'ఈడెన్ గార్డెన్‌లో సౌరవ్ గంగూలీ స్టాండ్ ఉండాలి. ఏమంటావ్ గంగూలీ' అని అన్నాడు. వెంటనే దాదా 'ఈ స్టేడియం మొత్తం నాదే భాయ్.. స్టాండుకు నా పేరెందుకు' అంటూ బదులిచ్చాడు. వెంటనే అక్కడ కామెంట్రీ బాక్స్ నవ్వులతో నిండిపోయింది. అలాంటి సందర్బాలు చాలా ఉన్నాయి. మచ్చుకు కొన్ని ఇక్కడ కింద చదవండి.

  David Warner: తన మనసులో బాధ బయటపెట్టిన వార్నర్.. జట్టును వీడటానికి అసలు కారణం వాళ్లే అని వెల్లడి.. వీలుంటే వస్తానంటూ..
  గ్రెగ్ చాపెల్ గురించి గంగూలీ..

  రాజ్‌దీప్ సర్దేశాయ్ (జర్నలిస్టు) : ఒక వేళ గ్రెగ్ చాపల్ ఇండియన్ క్రికెట్‌లో ఎవరికైనా క్షమాపణ చెప్పాలనుకుంటే.. ఎవరికి చెప్పాలి? సచిన్ టెండుల్కర్‌కా.. సౌరవ్ గంగూలీకా.. రాహుల్ ద్రవిడ్‌కా?

  గంగూలీ: ఆయన టెండుల్కర్ లేదా ద్రవిడ్‌కి కాల్ చేసి చెప్పొచ్చు. కానీ నా నెంబర్ డయల్ చేయడానికి కూడా ధైర్యం చెయ్యొద్దు. ఒక వేళ ఈ ఇంటర్వ్యూ చూస్తుంటే చెబుతున్నా.. సౌరవ్ గంగూలీకి కాల్ చేయడానికి సాహసం చెయ్యవద్దు.

  ఒక సారి ఆస్ట్రేలియాలో మ్యాచ్ జరుగుతున్నది. అప్పడు గంగూలీ వ్యాఖ్యలు..

  గంగూలీ: ఈ రోజు స్టేడియంలో 7653 మంది ప్రేక్షకులు ఉన్నారంటా.. కోల్‌కతాలో దుర్గపూజ చేస్తే ఇంతకు కంటే ఎక్కువ మందే వస్తారు.

  హర్ష భోగ్లేకే పంచ్..

  హర్ష: కోల్‌కతా టెస్టు మ్యాచ్‌లో నీ కంటే సచిన్ టెండుల్కర్ ఎక్కువగా పాపులర్ అయ్యాడు. అది నిజమేనా?

  గంగూలీ: అవును సచిన్ పాపులర్ అయ్యాడు. కానీ ఆ ఐదు రోజులకు మాత్రమే.

  ధోనీపై ఏమన్నాడంటే

  గంగూలీ: ధోనీ రిటైర్ అయ్యాక.. మ్యాచ్‌లో ఫీల్డర్లను ఎక్కడ మోహరించాలనే దానిపై పుస్తకం రాయాలి. అది అందరు కెప్టెన్లకు పంచాలి.

  కామెంట్రీ బాక్సులో ద్రవిడ్‌తో దబిడి దిబిడి

  ద్రవిడ్: గంగూలీ కనుక ఇంకొంచెం వేగంగా.. కాస్త ఫిట్‌గా ఉండి ఉంటే కచ్చితంగా మ్యాచ్ విన్నర్ అయ్యేవాడు.

  గంగూలీ : హా.. నేనుకూడా ఇండియాకు ప్రధాని అవ్వాలని అనుకుంటున్నా.. అప్పుడు ఇంత కంటే ఎక్కువే చేయగలను.

  బాయ్‌కాట్‌కు వాచిపోయింది..

  బాయ్ కాట్: ఆ రోజు నువ్వు క్రికెట్ మక్కాగా పిలువబడే లార్డ్స్‌లో షర్ట్ విప్పేసి సంబరాలు చేసుకున్నావు. దీని గురించి నువ్వేమి అనుకుంటున్నావు.

  గంగూలీ : మీ కుర్రాడు ఒకడు కూడా ముంబైలో షర్ట్ విప్పేసి ఇలాగే సంబరాలు చేసుకున్నాడు కదా

  బాయ్‌కాట్: అవును.. కానీ నువ్వు మక్కా ఆఫ్ క్రికెట్ లార్డ్స్‌లోనే విప్పావు కదా

  గంగూలీ: మీకు లార్డ్స్ మక్కా అయితే మాకు ముంబై వాంఖడే మక్కా

  టీవీలో వచ్చే మౌఖా మౌఖా యాడ్‌పై

  హర్ష భోగ్లే: నువ్వు మౌఖా మౌఖా యాడ్ చూశావా?

  గంగూలీ: హా చూవాను. చాలా బాగుంది. ఆ యాడ్ మరో 10 నుంచి 12 ఏళ్లు ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ వరల్డ్ కప్‌లో ఇండియాను ఓడించలేదు.
  Published by:John Naveen Kora
  First published: