బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ.. అంతకుముందు ఆ అరుదైన ఘనత సాధించింది మన తెలుగువాడే..

టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన సునీల్ గవాస్క్ 2014లో కొన్ని రోజులు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేశారు. కానీ, పూర్తిస్థాయిలో అధ్యక్షుడు మాత్రం కాలేదు.

news18-telugu
Updated: October 23, 2019, 6:42 PM IST
బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ.. అంతకుముందు ఆ అరుదైన ఘనత సాధించింది మన తెలుగువాడే..
బీసీసీఐ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన సౌరవ్ గంగూలీ (Image:BCCI/Twitter)
  • Share this:
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నెల మొదట్లో బీసీసీఐ అధ్యక్షుడి కోసం జరిగిన ఎన్నికల్లో కేవలం గంగూలీ ఒక్కడే నామినేషన్ దాఖలు చేశాడు. దీంతో ఈ కోల్‌కతా క్రికెటర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. బీసీసీఐ కార్యాలయంలో జరిగిన బాధ్యతల స్వీకార కార్యక్రమంలో గంగూలీతోపాటు మరికొందరు కూడా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా సెక్రటరీగా, మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ సింగ్ ధుమాల్ కోశాధికారిగా పగ్గాలు చేపట్టారు. మాహిమ్ వర్మ ఉపాధ్యక్షుడిగా, కేరళకు చెందిన జయేష్ జార్జ్.. జాయింట్ సెక్రటరీగా ఎంపికయ్యారు.

సంప్రదాయ భారత క్రికెట్‌కు దూకుడు నేర్పిన కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీకి పేరుంది. భారత జట్టుకు కెప్టెన్‌గా పనిచేసి.. ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు అయిన రెండో వ్యక్తి గంగూలీ. మరి మొదటి వ్యక్తి ఎవరో తెలుసా. ఆ ఖ్యాతి మన తెలుగువారికే దక్కింది. ‘మహారాజకుమార్ ఆఫ్ విజయనగర’గా పేరుపొందిన లెఫ్టినెంట్ కల్నల్ సర్ పూసపాటి విజయ ఆనంద గజపతిరాజు. ఆయన విజయనగర రాజు పూసపాటి విజయ రామ గజపతిరాజు రెండో కుమారుడు. అందరూ ఆయన్ను విజయనగరం యువరాజు అనేవారు. కొన్నాళ్లు అసలు పేరు మరుగునపడి ‘విజ్జీ’గా ప్రఖ్యాతిగాంచారు. విజ్జీ... భారత జట్టుకు నేతృత్వం వహించారు. 1936లో మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లిన జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత 1954లో బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలు అందించారు.

టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన సునీల్ గవాస్క్ 2014లో కొన్ని రోజులు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేశారు. కానీ, పూర్తిస్థాయిలో అధ్యక్షుడు మాత్రం కాలేదు.

First published: October 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు