Ravi Shastri Vs Ganguly: హెడ్ కోచ్ రవిశాస్త్రి, బీసీసీఐ చీఫ్ గంగూలీ మధ్య విభేదాలు..? ఇద్దరి మధ్య ఏం జరిగింది?

గంగూలీ-రవిశాస్త్రి మధ్య ఏం జరిగింది? గొడవకు కారణం ఏంటి? (PC: BCCI)

Ravi Shastri Vs Ganguly: కోచ్ రవిశాస్త్రి, బోర్డు అధ్యక్షుడు గంగూలీ మధ్య విభేదాలు ఉన్నాయా? వారిద్దరి మధ్య మాటలు లేవా? ఇద్దరూ ఎడమొకం పెడమొకంలా ఉన్నారా? ఈ విషయాలపై రవిశాస్త్రి ఏం చెబుతున్నాడు?

 • Share this:
  టీమ్ ఇండియా (Team India) హెడ్ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri), బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) మధ్య విభేదాలు ఉన్నాయా? ఇరువురి మధ్య మాటలు లేవా? అందుకే ఇంగ్లాండ్ (England)వచ్చిన గంగూలీ.. కెప్టెన్ విరాట్ కోహ్లీతో (Virat Kohli) మాట్లాడినా.. రవిశాస్త్రిని మాత్రం పక్కన పెట్టాడా? గత కొన్ని రోజులుగా జాతీయ మీడియాలో ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రవిశాస్త్రి, గంగూలీకి మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయని.. అవి ప్రస్తుతం తారాస్థాయికి చేరాయని వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ వార్తలపై హెడ్ కోచ్ రవిశాస్త్రి క్లారిటీ ఇచ్చారు. ఇద్దరి మధ్య మనస్పర్దలు ఉన్నాయా అని ప్రశ్నించగా.. అలాంటివి ఏవీ లేవని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. నాకు గంగూలీ ఎప్పటి నుంచో తెలుసు. టాటా స్టీల్ జట్టుకు నేను కెప్టెన్‌గా వ్యవహరించినప్పుడు గంగూలీ కూడా జట్టులో ఉన్నాడు. నా సారథ్యంలో అతడు ఆడాడు అని చెప్పాడు. అయితే అప్పటి నుంచే మీ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయా? అని ప్రశ్నించగా.. అదంతా జరిగిపోయిన గతం అని శాస్త్రి చెప్పాడు.

  టాటా స్టీల్‌కు ఆడినప్పుడు ఏం జరిగింది?

  టాటా స్టీల్ జట్టుకు రవిశాస్త్రి కెప్టెన్‌గా ఉన్న సమయంలో గంగూలీ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. మొదటి నుంచి సమయపాలన పాటించని గంగూలీ ఒక రోజు టీమ్ బస్ ఎక్కేందుకు ఆలస్యంగా వచ్చాడు. కానీ అప్పటికే కెప్టెన్ రవిశాస్త్రి జట్టును తీసుకొని వెళ్లిపోయాడు. అప్పటి నుంచి దాదాకు రవిశాస్త్రి అంటే కోపం. అదే విషయాన్ని ఇంటర్వ్యూలో అడగా.. నాకు గంగూలీతో ఎలాంటి సమస్యా లేదు. కానీ ఎవరి కోసం కూడా బస్సు ఆగదు. ఆ రోజు గంగూలీ బస్ మిస్సయ్యాడు. ఇంకో రోజు వేరే క్రికెటర్ మిస్అవుతాడు. టైం పాటించకుంటే అంతే కదా అని రవిశాస్త్రి చెప్పాడు.

  గంగూలీ, రవిశాస్త్రికి మధ్య మాటలు లేవా?

  ప్రపంచంలోనే మేటి క్రికెట్ బోర్డు, ఆ బోర్డుకు సంబంధించిన జట్లకు వారిద్దరూ హెడ్స్. ఒకరు బీసీసీఐ అధ్యక్షుడైతే మరొకరు టీమ్ ఇండియా కోచ్. మరి వారిద్దరి మధ్య ఎంతో సమన్వయం ఉండాలి. కానీ ఇద్దరూ మాట్లాడుకోవడం లేదని తెలుస్తున్నది. ఇది నిజమా అని ప్రశ్నించగా.. రవిశాస్త్రి తోసిపుచ్చాడు. నేను అధ్యక్షుడు దాదాతో ఇటీవల ఇంగ్లాండ్ వచ్చినప్పుడు మాట్లాడాను. చాలా మంది ఇద్దరి మధ్య మాటలు లేవని అంటున్నారు. కానీ అలాంటిది ఏమీ లేదు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండటం పట్ల కూడా నాకు వ్యతిరేకత లేదు. కాకపోతే ఇలాంటి వార్తలు మీడియా సృష్టిస్తుంటుంది. మీడియాకు ఇదొక మంచి మసాలా వార్త కదా అని కొట్టిపారేశాడు.

  BCCI Tenders: ఐపీఎల్‌లో రెండు కొత్త జట్ల కోసం టెండర్లు పిలిచిన బీసీసీఐ.. ఐటీటీ డాక్యుమెంట్ విలువ ఎంతంటే..


  అయితే మొదటి నుంచి గంగూలీ, రవిశాస్త్రికి మధ్య పెద్దగా మాటలు లేవు. ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో మనస్పర్దలు ఉన్నాయి. 2016లో రవిశాస్త్రి టీమ్ ఇండియా కోచ్‌గా ఇంటర్వ్యూలో పాల్గొనాల్సి ఉండగా.. అతడిని ఉదయం పూట ఇంటర్వ్యూ చేయకండి.. సాయంత్రం పూట చేయండి అని గంగూలీ వెటకారంగా వ్యాఖ్యానించారు. అప్పుడే ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు బయటి ప్రపంచానికి తెలిసింది. కానీ గంగూలీ అప్పట్లో క్యాబ్ అధ్యక్షుడిగా మాత్రమే ఉన్నారు. మరోవైపు రవిశాస్త్రి పదవీ కాలం టీ20 వరల్డ్ కప్ తర్వాత ముగియనున్నది.

  Vasoo Paranjape: గవాస్కర్, సచిన్, ద్రవిడ్, కుంబ్లే, రోహిత్ శర్మ.. ఎంతో మంది క్రికెటర్లను తీర్చిదిద్దిన కోచ్ హఠాన్మరణం


   

  Published by:John Naveen Kora
  First published: