హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics: షూటింగ్ ఫైనల్‌లో సౌరభ్.. గ్రూప్ మ్యాచ్ గెలిచిన ఇండియా.. మరిన్ని విశేషాలు

Tokyo Olympics: షూటింగ్ ఫైనల్‌లో సౌరభ్.. గ్రూప్ మ్యాచ్ గెలిచిన ఇండియా.. మరిన్ని విశేషాలు

షూటింగ్ ఫైనల్ రౌండ్‌లో సౌరభ్ చౌదరి

షూటింగ్ ఫైనల్ రౌండ్‌లో సౌరభ్ చౌదరి

టోక్యో ఒలింపిక్స్ షూటింగ్‌లో సౌరభ్ ఫైనల్ రౌండ్‌కు చేరుకున్నాడు. మరిన్న విశేషాలు ఇక్కడ చదవండి...

టోక్యో ఒలింపిక్స్‌లో (Tokyo Olympics) భారత యువ షూటర్ సౌరభ్ చౌదరి (Sourabh Chowdary) పతకంపై ఆశలు పెంచాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్  (Air Rifle) విభాగంలో ఫైనల్ రౌండ్‌లో చోటు సంపాదించాడు. 36 మంది పోటీ పడిన రౌండ్‌లో సౌరభ్ చౌదరి 586 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు అతడి సహచర భారత షూటర్ అభిషేక్ వర్మ 578 పాయింట్లతో 17వ స్థానంతో సరిపెట్టుకున్నారు. సౌరభ్ మొత్తం ఆరు సిరీస్‌లలో 95, 98, 100, 98, 97 పాయింట్లు సాధించాడు. ఈ రోజు మధ్యాహ్నం జరిగే మెడల్ ఈవెంట్‌లో అతడు తలపడనున్నాడు. మరోవైపు తప్పక పతకం సాధిస్తారని అనుకున్న టేబుల్ టెన్నిస్ జోడి ప్రీక్వార్టర్ ఫైనల్‌లో ఓటమిపాలైంది. భారత మిక్స్‌డ్ డబుల్ జోడి శరత్ కమల్, మనికా బాత్ర 11-8, 11-6, 11-5, 11-4 తేడాతో చైనీస్ తైపీకి చెందిన లిన్ యున్ జు, చెంగ్ ఐ చింగ్ చేతిలో ఓడిపోయారు. కాగా, వీరిద్దరూ పురుషుల, మహిళల సింగిల్స్‌లో పోటీ పడనున్నారు. టేబుల్ టెన్నిస్ వ్యక్తిగత విభాగంలో వీరిద్దరికీ మంచి అనుభవం ఉన్నది. అయితే చైనా, మలేషియాల నుంచి గట్టి పోటీ ఎదురు కానున్నది.

ఒలింపిక్స్‌లో పురుషుల హాకీ జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ దశలో న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-2 తేడాతో విజయం సాధించింది. హర్మన్ ప్రీత్ సింగ్ 26వ నిమిషంలో తొలి గోల్.. 33వ నిమిషంలో మరో గోల్ చేశాడు. ఇక మాజీ కెప్టెన్ శ్రీజేష్ అద్భుతమైన డిఫెండింగ్ ఆటను ప్రదర్శించాడు. గోల్ పోస్ట్ దగ్గర ప్రత్యర్థిని గోడలా అడ్డుకొని భారత జట్టు విజయంలో కీలక పాత్ర చేశాడు. అయితే టీమ్ ఇండియాకు 10వ నిమిషంలో రూపీందర్ పాల్ సింగ్ గోల్ చేసి ఉత్సాహాన్ని నింపాడు. మ్యాచ్ ప్రారంభమైన ఆరో నిమిషంలోనే న్యూజీలాండ్ గోల్ చేసింది. అయితే రూపీందర్ సింగ్ 10 నిమిషంలో గోల్ చేసి భారత శిబిరంలో ఉత్సాహాన్ని నింపాడు. ఇరు జట్లు హోరాహోరీగా తలపడినా తొలి అర్ద భాగంలో భారత్‌దే పై చేయి అయ్యిందిజ పది నిమిషాల వ్యవధిలో భారత్ రెండు గోల్స్ చేయడం విశేషం. ఇక హాకీలో అగ్రదేశమైన ఆస్ట్రేలియాతో ఆదివారం భారత జట్టు తదుపరి మ్యాచ్ ఆడనున్నది.


బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో బి సాయి ప్రణీత్ తొలి రౌండ్‌లోనే పరాజయం చెందాడు. ఇజ్రాయేల్‌కు చెందిన మిషా జిల్బర్‌మాన్‌పై 17-21, 15-21 తేడాతో ఓడిపోయి ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాడు.

భారత ఆర్చరీ మిక్స్‌డ్ డబుల్ జోడీ దీపికా కుమారి - ప్రవీణ్ జాదవ్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిపోయారు. దక్షిణ కొరియా ఆర్చర్లు వీరిద్దిరిపై 6-2 తేడాతో గెలుపొంది సెమీఫైనల్ చేరుకున్నారు.

First published:

Tags: Olympics, Tokyo Olympics

ఉత్తమ కథలు