అనిల్ కుంబ్లేకి సారీ చెప్పిన వీరేంద్ర సెహ్వాగ్.. ఎందుకో తెలుసా..?

కుంబ్లేకి శుభాకాంక్షలు చెబుతూనే.. గతంలో ఆయన సెంచరీ చేజారడానికి తానే కారణమైనందుకు 'సారీ' చెప్పాడు వీరేంద్ర సెహ్వాగ్.

news18-telugu
Updated: October 17, 2019, 1:21 PM IST
అనిల్ కుంబ్లేకి సారీ చెప్పిన వీరేంద్ర సెహ్వాగ్.. ఎందుకో తెలుసా..?
అనిల్ కుంబ్లే బర్త్ డే వేడుకలో సెహ్వాగ్ (File Photo)
  • Share this:
టీమిండియా మాజీ కోచ్,కెప్టెన్ అనిల్ కుంబ్లే గురువారం 49వ వడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలియజేశారు. కుంబ్లేకి శుభాకాంక్షలు చెబుతూనే.. గతంలో ఆయన సెంచరీ చేజారడానికి తానే కారణమైనందుకు 'సారీ' చెప్పారు. 'టీమిండియా దిగ్గజ మ్యాచ్ విన్నర్లలో మీరూ ఒకరు. మీలాంటి క్రికెటర్ మాకు స్ఫూర్తిదాయకం. మీ కెరీర్‌లో రెండో సెంచరీ నావల్ల మిస్ అయినందుకు సారీ చెబుతున్నాను. అయితే నిజ జీవితంలో మీరు సెంచరీ చేయాలని కోరుకుంటున్నాను. మరో 51ఏళ్లు.. కమాన్ అనిల్ భాయ్.. హ్యాపీ బర్త్ డే' అంటూ వీరూ ట్వీట్ చేశాడు.

కాగా,భారత్‌ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన ఘనత కుంబ్లేకి ఉంది. మొత్తం 619 వికెట్లు సాధించిన అనిల్ కుంబ్లే.. తన టెస్ట్ కెరీర్‌లో ఒక సెంచరీ చేశాడు. మరో సందర్భంలో సెంచరీకి దగ్గరిగా వచ్చినా.. దూకుడుగా ఆడాలన్న సెహ్వాగ్ సలహాతో సెంచరీ మిస్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే తనవల్ల సెంచరీ చేజార్చుకున్నందుకు కుంబ్లేకు సెహ్వాగ్ ఇప్పుడు సారీ చెప్పాడు. ఏదేమైనా సెహ్వాగ్ చేసిన ఈ ట్వీట్.. చాలామంది నెటిజెన్స్‌ను ఆకట్టుకుంటోంది. సెహ్వాగ్‌తో పాటు స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ కూడా కుంబ్లేకి శుభాకాంక్షలు చెప్పాడు. అందుకు థ్యాంక్స్ చెప్పిన కుంబ్లే.. ఇప్పుడు నువ్వు నాకు పంజాబీ పాఠాలు చెప్పాలంటూ ఛమత్కరించాడు. ఐపీఎల్‌లో పంజాబ్ జట్టు కోచ్‌గా నియమించబడటంతో భజ్జీని పంజాబీ పాఠాలు నేర్పించాలని కోరాడు కుంబ్లే.


First published: October 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు