• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • SONU SOOD RESPONDS SURESH RAINA TWEET REQUESTS OXYGEN CYLINDER FOR COVID 19 POSITIVE AUNT CYLINDER REACHING IN 10 MINS SA

సురేశ్‌ రైనాకు సోనూ సూద్ సాయం.. సోనూ నువ్వు దేవుడు కంటే ఎక్కువ!

సురేశ్‌ రైనాకు సోనూ సూద్ సాయం.. సోనూ నువ్వు దేవుడు కంటే ఎక్కువ!

suresh raina and sonu sued

తన మీరట్‌లో ఉంటున్న తన ఆంటీకి అత్యవసరంగా ఆక్సిజన్‌ సిలిండర్‌ కావాలని,ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో ప్రస్తుతం ఆమె త్రీవంగా బాధాపడుతున్నారంటూ రైనా ట్వీట్‌ చేశాడు.

  • Last Updated:
  • Share this:
    కరోనా కష్టకాలంలో ప్రజలు అదుకుంటుూ బాధితుల పాలిట ఆపద్బాంధవుడిగా నిలిచిన నటుడు సోనూ సూద్‌. రిల్ లైఫ్ రియల్ లైఫ్‌లోనూ నిజమైన హీరోగా నిలుస్తున్నాడు. బాధితులు కొరిన వెంటనే వారికి ఆర్థిక, వైద్య సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. మెుదటి వలస కూలీలకు తమ స్వస్థలకు పంపి కార్మికులను ఆదుకున్నారు. కరోనా సమయంలో విద్యార్థుల చదులకు అటంకం కలగకుండే ఉండేందుకు వారికి తన శక్తి మేరకు సాహయాన్ని అందజేస్తున్నారు. ఇక కరోనా సంక్షోభంలో ఎంతో మంది బాధితులను అదుకున్న సోనూ సూద్ తాజాగా క్రికెటర్ సురేశ్​ రైనాకు సాయం చేశారు. అతని కొరిక మేరకు కేవలం 10 నిమిషాల్లోనే ఆక్సిజన్​ సిలిండర్​ను పంపి మానవత్వాన్ని చాటుకున్నారు.





    తన మీరట్‌లో ఉంటున్న తన ఆంటీకి అత్యవసరంగా ఆక్సిజన్‌ సిలిండర్‌ కావాలని,ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో ప్రస్తుతం ఆమె త్రీవంగా బాధాపడుతున్నారంటూ రైనా ట్వీట్‌ చేశాడు. దీనికి స్పందించిన సోనూ సూద్‌.. 10 నిమిషాల్లోనే ఆక్సిజన్‌ సిలిండర్‌ అక్కడికి వస్తుంది' అంటూ రిప్లై ఇచ్చారు. అనుకుంటాగానే సిలండర్‌‌ను చేరవేశారు. పోనూ సూద్ బృందం దేశ వ్యాప్తంగా ప్రజలకు విసృత్తంగా సేవలను అందిస్తోంది. తాజాగా కర్ణాటకలోని సోనూ సూద్‌ బృందం 20-22 మంది ప్రాణాలను కాపాడింది. బెంగళూరులోని అరక్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ కొరత ఉందని సత్యనారాయణన్‌ అనే ఓ పోలీసు అధికారి కర్ణాటకలోని సోనూసూద్‌ బృందానికి విన్నవించారు. దీంతో వారు ఆ ఆస్పత్రికి 16 ఆక్సిజన్‌ సిలిండర్లను అందుబాటులో ఉంచారు.
    Published by:Rekulapally Saichand
    First published: