హోమ్ /వార్తలు /క్రీడలు /

Sonu Sood: సోనూసూద్ మరో ఘనత.. స్పెషల్ ఒలింపిక్స్‌లో భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక

Sonu Sood: సోనూసూద్ మరో ఘనత.. స్పెషల్ ఒలింపిక్స్‌లో భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక

సోనూసూద్(ఫైల్ ఫొటో)

సోనూసూద్(ఫైల్ ఫొటో)

కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న సోనూసూద్.. మరో ఘనత సాధించారు.

కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న సోనూసూద్.. మరో ఘనత సాధించారు. వచ్చే ఏడాది రష్యాలో జరగనున్న స్పెషల్ ఒలింపిక్స్‌ వరల్డ్ వింటర్ గేమ్స్‌కు భారత బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. 2022 జనవరిలో.. రష్యాలోని కజాన్‌లో జరిగే స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్‌కు భారత బృందంతో పాటు వెళ్లనున్నట్లు సోనూసూద్ ప్రకటించారు. ఈవెంట్‌కి భారతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైనట్లు ఆయన స్వయంగా వెల్లడించారు.

కరోనా విజృంభించిన సమయంలో దేశ వ్యాప్తంగా ఎంతోమందికి ఆపన్త హస్తం అందించిన సోనూసూద్ జూలై 30న తన 48వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా భారత్‌లో వికలాంగ క్రీడాకారుల కోసం పనిచేసే అధికారిక స్పోర్ట్స్ ఫెడరేషన్- ‘స్పెషల్ ఒలింపిక్స్ భారత్‌’కు చెందిన స్పెషల్ అథ్లెట్లు, అధికారులతో ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో సోనూసూద్ మాట్లాడారు. ఈ క్రమంలో స్పెషల్ ఒలింపిక్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైనట్లు వెల్లడించారు. స్పెషల్ ఒలింపిక్స్ జట్టుతో చేరడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

‘స్పెషల్ ఒలింపిక్స్‌లో భాగం కావడం నాకు గర్వకారణం. వివిధ క్రీడల్లో విజయాలు సాధిస్తోన్న స్పెషల్ అథ్లెట్‌లు.. సవాళ్లను ఎదుర్కొంటూ అందరిలోనూ స్ఫూర్తిని నింపుతున్నారు. వచ్చే వింటర్ ఒలింపిక్స్‌లో వారందరూ విజయం కోసం కృషి చేస్తూ, వారి సామర్థ్యాలను బయటకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. స్పెషల్ ఒలింపిక్స్ భారత్ కుటుంబంలో చేరడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ప్లాట్‌ఫాంను మరింత పెద్దదిగా చేయడానికి, దేశవ్యాప్తంగా ఉన్న స్పెషల్ అథ్లెట్లను ఇందులో భాగం చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను’ అని సోనూసూద్ వివరించారు.

* అభినందించిన స్పెషల్ ఒలింపిక్స్ భారత్‌

ఈ స్పోర్ట్స్ ఈవెంట్‌లో మన అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేలా ప్రోత్సహించడంతో పాటు వారిని ఉత్సాహపరుస్తానని తెలిపారు. ఈ సందర్భంగా సోనూసూద్‌కు కృతజ్ఞతలు తెలిపారు స్పెషల్ ఒలింపిక్స్ భారత్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఛైర్‌పర్సన్ డాక్టర్ మల్లికా నడ్డా. స్పెషల్ ఒలింపిక్స్ కుటుంబంలో చేరడానికి అంగీకరించినందుకు ఆయనను అభినందించారు.

Published by:Sumanth Kanukula
First published:

Tags: India, Olympics, Sonu Sood

ఉత్తమ కథలు