Warner Wife: టాయిలెట్‌లో వేరే వ్యక్తితో అభ్యంతరకర స్థితిలో డేవిడ్ వార్నర్ భార్య.. తప్పు చేశానని ఒప్పుకున్న కాండీస్ వార్నర్

వేరే వ్యక్తితో డేవిడ్ వార్నర్ భార్య శృంగారం... తప్పు ఒప్పుకున్న కాండీస్

David Warner: డేవిడ్ వార్నర్ భార్య కాండీస్ చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్‌కు సుపరిచితమే. ఆమె తరచూ తెలుగు పాటలకు స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతుంది. అయితే ఆవిడ జీవితంలో మరిచిపోలేని తప్పు ఒకటి చేసింది. దాని గురించి కన్ఫెషన్ కూడా చేసింది.

 • Share this:
  ఒకప్పుడు ఇతర దేశాలకు చెందిన క్రికెట్ ఆటగాళ్ల పేర్లు మాత్రమే గుర్తుండేవి. కానీ ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల వివరాలతో సహా అందరూ చెప్పేస్తున్నారు. అందుకు కారణం సోషల్ మీడియా (Social Media) అయితే.. మరో కారణం ఐపీఎల్. గత 14 సీజన్లుగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కారణంగా ఎంతో మంది విదేశీ క్రీడాకారులను భారత క్రికెట్ (Cricket) ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు. ఇక్కడి వ్యక్తే అన్న విధంగా వాళ్లు విదేశీ క్రికెటర్ల పట్ల ప్రేమ పంచుకున్నారు. చెన్నై వాళ్లు డ్వేన్ బ్రావోను.. ముంబై వాళ్లు పొలార్డ్‌ను.. బెంగళూరు వాళ్లు ఏబీ డివిలియర్స్‌ను ప్రేమించినట్లే.. హైదరాబాదీలు డేవిడ్ వార్నర్ (David Warner) అంటే అంతే ఇష్టపడతారు. ఇప్పుడంటే అనుకోని పరిస్థితుల్లో వార్నర్ జట్టుకు దూరమయ్యాడు. కానీ నిన్న మొన్నటి వరకు డేవిడ్ వార్నర్‌నే కాకుండా మొత్తం కుటుంబాన్నే సొంత వ్యక్తుల్లా అందురూ ప్రేమించారు. అందుకే వార్నర్‌తో పాటు వార్నర్ భార్య కాండీస్ (Candice Warner).. అతడి ముగ్గురి పిల్లలు సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు సుపరిచితమే.

  తాజాగా డేవిడ్ వార్నర్ భార్య గురించిన ఒక పచ్చి నిజం బయటకు వచ్చింది. వార్నర్ భార్య కాండీస్ ఒక వ్యక్తితో టాయిలెట్‌లో సెక్స్ చేస్తుండగా దొరికి పోయింది. అయితే ఇది 2007లో ముచ్చట. అప్పటి సంగతి ఇప్పుడు ఎందుకు అని మీకు డౌట్ రావొచ్చు. అసలు విషయం ఏంటంటే.. ఆస్ట్రేలియాలో క్రాస్-కోడ్ అనే గేమ్ ఉంది. అది ఒక రియాల్టీ గేమ్ లాంటిది. అందులో పాల్గొనే వ్యక్తులు ఏదో ఒక వేషం వేసుకొని ఆడుతూ ఉంటారు. అప్పట్లో కాండీస్ వార్నర్ కూడా క్రాస్-కోడ్ గేమ్‌లో ఒక సూపర్ స్టార్. ఆస్ట్రేలియాలో ఐరన్ ఉమెన్‌గా ఆమె ఎంతో పాపులర్. అదే సమయంలో సన్నీ బిల్ విలియమ్స్ అనే వ్యక్తి కూడా క్రాస్-కోడ్‌లో సూపర్ స్టార్.

  Sunil Chhetri: భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సంచలనం.. అంతర్జాతీయ గోల్స్‌లో పీలేతో సమానంగా సునిల్ ఛెత్రి


  ఒకసారి వీళ్లిద్దరూ ఒక నైట్ క్లబ్‌కు వెళ్లి ఫూటుగా మద్యం సేవించారు. ఆ తర్వాత టాయిలెట్లో దూరి శృంగారంలో మునిగిపోయారు. ఇది ఎవరో వీడియో తీసి రచ్చ రచ్చ చేశారు. దీంతో కాండీస్ సెక్స్-స్కాండల్ ఆస్ట్రేలియా అంతటా మార్మోగిపోయింది. ఆ తర్వాత కాండీస్ క్రాస్-కోడ్ గేమ్స్ మానేసి మామూలు జీవితం గడిపింది. వార్నర్‌ను పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లలకు తల్లి అయి చాలా హ్యాపీగా జీవితాన్ని సాగిస్తున్నది. కానీ 2007లో చేసిన ఆ తప్పును ఇప్పటికీ చాలా మంది ఎత్తి చూపుతూ ఆమె పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు.

  ప్రపంచంలోని పాపులర్ లెస్బియన్ క్రీడాకారిణులు వీరే.. వివక్ష నుంచి విజేతలుగా


  2018లో డేవిడ్ వార్నర్ బాల్ టాంపరింగ్ వివాదంలో ఇరుక్కున్న సమయంలో కూడా వార్నర్ కంటే ఎక్కువగా కాండీస్‌ను తిట్టిపోశారు. నువ్వొక బ్యాడ్ మదర్, బ్యాడ్ వైఫ్ అంటూ పాత విషయాలను గుర్తు చేసి హర్ట్ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఒక రియాల్టీ షోలో పంచుకున్నారు. ఆ విషయాన్ని ఎంత మర్చిపోదామనుకున్నా.. పదే పదే గుర్తు చేస్తున్నారని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.

  తాజాగా ఆనాటి స్కాండల్‌లో ఉన్న సన్నీ బిల్ విలియమ్స్ ఒక పుస్తకం రాస్తున్నాడు. 'యు కాంట్ స్టాప్ ద సన్ ఫ్రమ్ షైనింగ్' పేరుతో రాస్తున్న ఈ పుస్తకంలో ఆనాడు కాండీస్ వార్నర్‌తో జరిగిన ఉదంతాన్ని కూడా ఉటంకిస్తూ రాసుకొచ్చాడు. దీంతో మరోసారి కాండీస్ వ్యవహారం పతాక శీర్షికలకు ఎక్కింది. మరోసారి ఆస్ట్రేలియాలో ఆమె పట్ల అసభ్యకరమైన కామెంట్లు మొదలయ్యాయి. తెలిసీ తెలియని వయసులో చేసిన తప్పును ఒప్పుకున్నా.. ఇప్పటికీ వేధింపులకు గురి చేస్తున్నారని కాండీస్ వాపోతున్నది. సన్నీ ఇప్పుడు పుస్తకంలో ఆ ఇన్సిడెంట్ రాయాల్సిన అవసరం ఏముందని కాండీస్ మద్దతుదారులు అంటున్నారు.
  Published by:John Naveen Kora
  First published: