ఇండియా-ఇంగ్లాండ్ (India Vs England) మధ్య లీడ్స్‌లోని హెడింగ్లేలో జరిగిన మూడో టెస్టులో (3rd Test)భారత జట్టు (Team India) ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. చాలా మ్యాచ్‌ల అనంతరం టాస్ గెలిచిన కోహ్లీ (Virat Kohli) మ్యాచ్ మాత్రం గెలవలేక పోయాడు. ఇప్పటి వరకు ఏ సిరీస్‌లోనూ కెప్టెన్‌గా కోహ్లీ మూడో టెస్టు ఓడిపోలేదు. కానీ లీడ్స్ టెస్టులో ఆ రికార్డు కూడా చెరిగిపోయింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ జట్టు (England Team) 432 పరుగులు భారీ స్కోర్ సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 215 పరుగులతో పటిష్ట స్థితిలో కనిపించిన భారత జట్టు కేవలం ఒకే సెషన్లో 8 వికెట్లు కోల్పోయి ఓడిపోయింది. ఈ మ్యాచ్ గెలవడంతో ఇంగ్లాండ్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక ఈ మ్యాచ్ ద్వారా అనేక కొత్త రికార్డులు నమోదయ్యాయి. అవేంటంటే...
- కోహ్లీ కెప్టెన్సీలో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం రెండో సారి. లీడ్స్ టెస్టులో ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది.
- కోహ్లీ నేతృత్వంలో 2018లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో ఓడిపోయింది.
- భారత జట్టు అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో (2020-21) జరిగిన మ్యాచ్ టాస్ గెలిచినా.. మ్యాచ్ ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో భారత జట్టు 36 పరుగులకే రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయ్యింది.
- లీడ్స్‌లో జరిగిన టెస్టులో కూడా కోహ్లీ టాస్ గెలిచినా.. మ్యాచ్ గెలవలేకపోయాడు. ఇక్కడ కూడా భారత జట్టు 78 పరుగుల అత్యల్ప స్కోర్ నమోదు చేసింది.
- భారత జట్టు నాలుగో వికెట్ కోల్పోయిన తర్వాత అత్యల్ప పరుగులు చేసిన మ్యాచ్ లలో ఇది ఒకటి. లీడ్స్‌లో నాలుగో వికెట్ కోల్పోయిన తర్వాత 63 పరుగులు మాత్రమే చేసింది.
- పూణే వేదికగా 2016/17 సీజన్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో నాలుగో వికెట్ కోల్పోయిన తర్వాత అతి తక్కువగా 41 పరుగులు మాత్రమే చేసింది,
- 1952లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో భారత జట్టు నాలుగో వికెట్ కోల్పోయిన తర్వాత 64 పరుగులే చేసింది.
- 2020/21 సీజన్లో అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో నాలుగో వికెట్ కోల్పోయిన తర్వాత రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 77 పరుగులే చేసింది.
- ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 55 టెస్టుల్లో నాయకత్వం వహించి 27 మ్యాచ్‌లు గెలిపించాడు. అత్యధిక విజయాలు అందించిన ఇంగ్లాండ్ కెప్టెన్‌గా అతడు రికార్డు సృష్టించాడు.
- మైఖెల్ వాన్ 51 టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించి 26 మ్యాచ్‌లు గెలిపించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.