క్రికెట్ చూడడానికి వచ్చిన పాము.. పంపేసిన ప్లేయర్లు...

ఆంధ్ర, విదర్భ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు పాము అంతరాయం కలిగించింది.

news18-telugu
Updated: December 9, 2019, 3:46 PM IST
క్రికెట్ చూడడానికి వచ్చిన పాము.. పంపేసిన ప్లేయర్లు...
పాము (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆంధ్ర, విదర్భ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు పాము అంతరాయం కలిగించింది. రెండు జట్లు మ్యాచ్ ప్రారంభానికి ముందు గ్రౌండ్‌లోకి వెళ్లాయి. అయితే, ఆ సమయంలో మైదానంలో పాము కనిపించింది. దీంతో ఆటగాళ్లు అందరూ ఆ పాముని బయటకు పంపేందుకు ప్రయత్నం చేశారు. ఆటగాళ్లను చూసిన తర్వాత పాము కూడా స్పీడుగా వెళ్లిపోయింది. దీంతో మ్యాచ్ ప్రారంభం కొద్దిసేపు ఆలస్యం అయింది. పాము వెళ్లిపోయిన తర్వాత ఆట ప్రారంభమైంది. ఈ విషయాన్ని బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. ఆంధ్ర, విదర్భ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఆంధ్ర ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 70 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. గిరినాథ్ రెడ్డి, అయ్యప్ప బండారు క్రీజ్‌లో ఉన్నారు.

Published by: Ashok Kumar Bonepalli
First published: December 9, 2019, 3:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading