SMRITI MANDHANA AND OTHER INDIAN WOMEN CRICKETERS DANCE VIDEO GOES VIRAL IN SOCIAL MEDIA WATCH SRD
Smriti Mandhana : వామ్మో.. స్మృతి మంధానలో ఇంత టాలెంట్ ఉందా..? డ్యాన్స్ ఇరగదీసిన స్టార్ బ్యాటర్..
Smriti Mandhana (Instagram)
Smriti Mandhana : టీమ్ ఇండియా క్రికెటర్ స్మృతి మంధానకు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆటతో పాటు అందం కూడా ఉన్న మంధానకు యువతలో చాలా ఫాలోయింగ్ ఉంది.
మెన్స్ తో పోలీస్తే వుమెన్స్ క్రికెటర్లలో జనాల్లో ఆదరణ సంపాదించుకున్న క్రికెటర్లు చాలా తక్కువ మంది. అందులో వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ తర్వాత అందరికీ తెలిసిన పేరు స్మృతి మంధానా (Smriti Mandhana). ఇక, లేటెస్ట్ గా తమ ప్రదర్శనతో అదరగొడుతున్నారు అమ్మాయిలు. దీంతో, సోషల్ మీడియాలో తెగ క్రేజ్ సంపాదిస్తున్నారు. ఇక, టీమ్ ఇండియా క్రికెటర్ స్మృతి మంధానకు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆటతో పాటు అందం కూడా ఉన్న మంధానకు యువతలో చాలా ఫాలోయింగ్ ఉంది. నేషనల్ క్రష్ గా కూడా పేరు సంపాదించుకుంది స్మృతి మంధాన. మన టీమిండియా క్రికెటర్లు ఇప్పటి వరకు చాలా మంది తమలో ఉన్న ఇతర టాలెంట్స్ ని చాలా సార్లు బయటపెట్టారు. తాజాగా.. టీమిండియా స్మృతి మంథానా ( Smriti Mandhana Talent) తన స్పెషల్ టాలెంట్ బయట పెట్టారు.
స్మృతీ మంథానా తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో స్మృతి "ఇన్ డా ఘెట్టో" అనే వైరల్ సాంగ్ కి డ్యాన్స్ వేశారు. ఆమెతో పాటు పలువురు స్నేహితులు మహిళా క్రికెటర్లు కూడా అందులో ఉన్నారు ఆమె డ్యాన్స్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో స్మృతీ మంధానతోపాటు.. ఆమె స్నేహితులు, టీమిండియా మహిళ జట్టు క్రికెటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, రాధా యాదవ్ కూడా ఉండటం గమనార్హం. వారంతా డ్యాన్స్ సూపర్ గా వేశారు.
ఈ వీడియో షేర్ చేసిన స్మృతి.. వీడియో చేయాలనే ఆలోచన అయితే.. తనది కాదంటూ క్యాప్షన్ పెట్టడం గమనార్హం. ఎవరూ జడ్జ్ చేయవద్దని.. తనతో బలవంతంగా ఈ వీడియో చేయించారంటూ ఆమె క్యాప్షన్ లో పేర్కొనడం విశేషం. అయితే.. ఆమె క్యాప్షన్ కి.. ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హీథర్ నైట్ ఫన్నీ కామెంట్ చేశారు. ఇది కచ్చితంగా స్మృతీ మంధాన ఐడియానే అయ్యి ఉంటుందని కామెంట్ చేసింది.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పలువురు టీమిండియా మహిళల క్రికెటర్లు.. బిగ్ బాష్ లీగ్ కోసం ఆస్ట్రేలియాలో ఉండటం గమనార్హం. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్, రాధా యాదవ్, షెఫాలీ వర్మ, పునమ్ యాదవ్, రిచా ఘోష్ వంటి క్రికెటర్లు వివిధ ప్రాంచైజీల తరపున సత్తా చాటుతున్నారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.