Home /News /sports /

SL VS WI DHANANJAYA DE SILVA BECOMES THE SECOND SRI LANKAN TO HIT HIS OWN WICKETS TWICE IN TEST CRICKET WATCH VIRAL VIDEO SRD

Viral Video : దురదృష్టానికి కేరాఫ్ అడ్రస్ ధనంజయ డిసిల్వా.. ఇలా కూడా ఔటవుతారా..?

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Viral Video : ఈ మ్యాచ్‌లో 61 పరుగులు చేసిన ధనంజయ డి సిల్వా మంచి టచ్‌లో కనిపించాడు. అయితే వెస్టిండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ గాబ్రియెల్ వేసిన 95వ ఓవర్‌లో.. రెండో బంతిని డి సిల్వా ఢిపెన్స్‌ ఆడగా అది ఎడ్జ్‌ తీసుకుని స్టంప్స్‌ను తాకబోయింది.

ఇంకా చదవండి ...
    క్రికెట్ (Cricket Latest Updates) అంటేనే ఓ అద్భుతం అంటారు. ఈ జెంటిల్మెన్ గేమ్ లో ఊహించని విన్యాసాలు జరుగుతుంటాయ్. ఇక అందులో ఆటగాళ్లు చేసే అద్భుత విన్యాసాలు నెవ్వర్ భిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా ఉంటాయి. ఇక, ఈ గేమ్ లో ఒక్కొక్కసారి ఊహించని విధంగా బ్యాటర్లు ఔటవ్వడం మనం చూస్తుంటాం. అలాంటి ఘటనే గాలే వేదికగా జరుగుతున్న శ్రీలంక వర్సెస్ విండీస్ (Sri Lanka Vs Wsest Indies) టెస్ట్ మ్యాచులో చోటు చేసుకుంది. ఈ మ్యాచులో శ్రీలంక బ్యాటర్ ధనంజయ డిసిల్వా (Dhananjaya de Silva) దురదృష్టకర రీతిలో తన వికెట్ కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో 61 పరుగులు చేసిన ధనంజయ డి సిల్వా మంచి టచ్‌లో కనిపించాడు. అయితే వెస్టిండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ గాబ్రియెల్ వేసిన 95వ ఓవర్‌లో.. రెండో బంతిని డి సిల్వా ఢిపెన్స్‌ ఆడగా అది ఎడ్జ్‌ తీసుకుని స్టంప్స్‌ను తాకబోయింది.

    ఈ క్రమంలో బంతిని స్టంప్‌కు తగలకుండా డిసిల్వా ఆపడానికి ప్రయత్నించాడు. అయితే అతడు అనుకోకుండా తన బ్యాట్‌తో బెయిల్స్‌ని పడగొట్టాడు. దీని ఫలితంగా ధనంజయ డి సిల్వా హిట్‌ వికెట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. అయితే, టెస్టుల్లో హిట్‌ వికెట్‌గా వెనుదిరగడం అతడికి ఇది రెండోసారి. అధేవిధంగా టెస్ట్‌ క్రికెట్‌లో రెండు సార్లు హిట్‌ వికెట్‌గా ఔటైన రెండో శ్రీలంక ఆటగాడిగా ధనంజయ డి సిల్వా నిలిచాడు.


    ప్రస్తుతం ఈ ఔట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు.. భిన్నంగా స్పందిస్తున్నారు. ధనంజయ డిసిల్వా బ్యాడ్ లక్ కు బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నావుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

    ఇది కూడా చదవండి :  ఇండియాలో క్రికెట్ వదిలేసి అమెరికా వెళ్లాడు.. ఇప్పుడు పెళ్లి చేసుకొని ఇంటివాడైన ఉన్ముక్త్ చంద్

    ఈ టెస్ట్ మ్యాచులో శ్రీలంక తమ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 386 పరుగుల వద్ద ఆలౌటైంది. శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణ రత్నె 300 బంతుల్లో 147 పరుగుల భారీ ఇన్నింగ్స్ తో శ్రీలంక ఇన్నింగ్స్ ని నిలబెట్టాడు. అతడితో పాటు పాతుమ్ నిషంక 56 పరుగులు, ధనంజయ డిసిల్వా 61 పరుగులతో రాణించారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, Sri Lanka, Viral Video, West Indies

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు