హోమ్ /వార్తలు /క్రీడలు /

SL vs IND : క్రికెట్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్..వన్డే, టీ20 సిరీస్ షెడ్యూల్లో మార్పు..తొలి వన్డే ఎప్పుడంటే..!

SL vs IND : క్రికెట్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్..వన్డే, టీ20 సిరీస్ షెడ్యూల్లో మార్పు..తొలి వన్డే ఎప్పుడంటే..!

SL vs IND

SL vs IND

SL vs IND : భారత్‌, శ్రీలంకల మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్‌ అయోమయంలో పడింది. ఈ టూర్ కు ఏదీ కలిసిరావడం లేదు. వరుసగా ఏదో రకంగా అడ్డంకులు తగులుతూనే ఉన్నాయ్. జాతీయ కాంట్రాక్ట్ ఒప్పందాల విషయంలో శ్రీలంక ప్లేయర్స్ అలగడం..ఇంగ్లండ్ పర్యటనలో ఆటగాళ్లకు కరోనా సోకడం, ఇటీవల లంక ఆటగాళ్ల విమానం భారత్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వడం వంటి సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయ్.

ఇంకా చదవండి ...

భారత్- శ్రీలంక మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్‌‌లకు కరోనా సెగ తగిలింది. శ్రీలంక టీమ్‌లో వరుసగా కరోనా కేసుల బయటపడుతుండటంతో వన్డే, టీ20 సిరీస్‌లను రీషెడ్యూల్ చేయాలని లంక క్రికెట్ బోర్డు నిర్ణయించినట్లు క్రిక్ బజ్ తెలిపిందిషెడ్యూల్‌ కంటే నాలుగు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ నెల 17న తొలి వన్డే, 19న రెండో వన్డే, 21న మూడో వన్డే జరుగనుంది. ఈ నెల 24న తొలి టీ-20 మ్యాచ్‌ జరుగనుండగా.. 25న రెండో మ్యాచ్‌, 27న మూడో మ్యాచ్‌ జరుగనుంది. ఇంతకు ముందు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం సిరీస్‌ ఈ నెల 13 తేదీన ప్రారంభం కావాల్సి ఉంది. ఈ షెడ్యూల్ శ్రీలంక క్రికెట్ బోర్డు రేపు ప్రకటించే అవకాశం ఉంది. భారత్‌తో సిరీస్‌కు ముందు శ్రీలంక జట్టులో కరోనా కేసులు బయటపడ్డాయి. ఇటీవల ఇంగ్లండ్‌కు వెళ్లి వ‌చ్చిన టీమ్‌లో మొద‌ట బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్‌ కరోనా బారినపడగా.. ఆ తర్వాత టీమ్‌ డేటా అనలిస్ట్‌ జీటీ నిరోషన్‌కు సైతం కరోనా సోకింది. ప్రస్తుతం కరోనా ఇద్దరూ.. చికిత్స పొందుతున్నారని శ్రీలంక క్రికెట్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

శ్రీలంక జట్టు ఇంగ్లండ్‌లో మూడు వ‌న్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఆ సిరీస్ ముగిసిన వెంట‌నే ఇంగ్లండ్ టీమ్‌లో ముగ్గురు ప్లేయ‌ర్స్ స‌హా మొత్తం ఏడుగురికి క‌రోనా సోకిన‌ట్లు గుర్తించారు. అక్కడికి నుంచి స్వదేశానికి వ‌చ్చిన శ్రీలంక టీమ్‌కు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. గ్రాంట్‌ ఫ్లవర్‌, నిరోషన్‌ వైరస్‌ బారినపడ్డట్లు తేలింది. అయితే ఆటగాళ్లకు మాత్రం నెగటీవ్ వచ్చిందని పేర్కొంది. ఫ్లవర్​, నిరోషన్​లు ప్రస్తుతం క్వారంటైన్​లో ఉండి.. చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.

First published:

Tags: Bcci, Corona effect, India vs srilanka, Shikhar Dhawan

ఉత్తమ కథలు