SL vs BAN : బంగ్లాదేశ్ (Bangladesh), శ్రీలంక (Sri Lanka) జట్ల మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో అపశ్రుతి చోటు చేసుకుంది. తొలి రోజు ఆటలో భాగంగా శ్రీలంక యువ బ్యాటర్ కుశాల్ మెండీస్ (Kushal Mendis) మైదానంలో ఛాతి నొప్పితో విలవిల్లాడాడు. దాంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. 23వ ఓవర్ జరుగుతున్న సమయంలో కుశాల్ మెండీస్ కు ఛాతిలో నొప్పి మొదలైంది. కాసేపటికి అది ఎక్కువ అవ్వడంతో ఫిజియోలు మైదానంలోకి వచ్చారు. పరిస్థితి చెయ్యి దాటకుండా వెంటనే అతడిని ఢాకాలోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియగా.. రెండో టెస్టు మ్యాచ్ సోమవారం ఆరంభం అయ్యింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 84 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఇటీవలె 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న ముష్ఫికర్ రహీమ్ (250 బంతుల్లో 115 బ్యాటింగ్ ; 13 ఫోర్లు), లిట్టన్ దాస్ (129 బ్యాటింగ్; 15 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ అజేయమైన ఆరో వికెట్ కు 247 పరుగులు జోడించారు. ఒక దశలో బంగ్లాదేశ్ 24 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్ లు బంగ్లాదేశ్ ను ఆదుకున్నారు. వీరిద్దరూ మొదట క్రీజులో పాతుకుపోవడానికి సమయం తీసుకున్నారు. కుదురుకున్నాక స్వేచ్ఛగా ఆడుతూ బౌండరీలు సాధించారు.
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పిచ్ పై ఉన్న పచ్చికను ఉపయోగించుకున్న శ్రీలంక పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో బంగ్లాదేశ్ బ్యాటర్లను ఓ ఆట ఆడుకున్నారు. కసున్ రజిత, అసిత ఫెర్నాండో పోటీ పడి మరీ వికెట్లు తీశారు. రజిత మూడు వికెట్లు తీయగా.. అసిత ఫెర్నాండో రెండు వికెట్లను ఖాతాలో వేసుకున్నారు. వీరి ధాటికి హసన్ జాయ్ (0), తమీమ్ ఇక్బాల్ (0), నజ్ముల్ హోసీన్ సాంటో (8), కెప్టెన్ మోమినుల్ హక్ (9), షకీబుల్ హసన్ (0) వెంటవెంటనే పెవిలియన్ కు చేరుకున్నాడు. అయితే క్రీజులోకి వచ్చిన ముష్పికర్ రహీమ్, లిటన్ దాస్ లు ఓపిగ్గా ఆడుతూ జట్టును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆట 23వ ఓవర్ జరుగుతుండగా కుశాల్ మెండీస్ ఛాతి నొప్పితో బాధ పడ్డాడు. దాంతో అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో చేర్చించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangladesh, IPL, IPL 2022, Sri Lanka