Home /News /sports /

SL VS AUS FIRST ODI DAVID WARNER PLUCKS STUNNING ONE HANDED CATCH AND BOWLER BATTER ARE SHOCKS WATCH VIDEO VIRAL SRD

David Warner : వార్నీ వార్నరూ.. సూపర్ మ్యాన్ అన్నలా ఉన్నావ్.. స్టన్నింగ్ క్యాచ్ తో ఔరా అన్పించాడు..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

David Warner : బాల్ గాల్లోకి లేవగానే బాల్ వైపే చూస్తుండిపోయిన అగర్..వార్నర్ క్యాచ్ పట్టుకుంటాడని అస్సలు నమ్మలేదు. అయితే కరెక్ట్ టైమింగ్తో ఎగిరిన వార్నర్..కళ్లు చెదిరే విధంగా బంతిని అందుకుని ఆశ్చర్య పరిచాడు.

    క్రికెట్ (Cricket News) అంటేనే ఓ అద్భుతం అంటారు. అందులోనూ లిమిటెట్ క్రికెట్ (Limited Cricket) లో ఆట ఇంకాస్త అదుర్స్ అనిపిస్తోంది. అభిమానులను ఫుల్ మీల్స్ లాంటి విందు అందిస్తోంది. సిక్స్ లైన్ వద్ద సూపర్ మ్యాన్ లా ఎగిరి ఫీల్డర్లు క్యాచ్ పట్టడం, సాధ్యం కాదనుకున్న ఫీట్స్ సాధించడం.. బ్యాటర్ల జోరు.. బౌలర్ల జోరు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో..! ఇక అందులో ఆటగాళ్లు చేసే అద్భుత విన్యాసాలు నెవ్వర్ భిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా ఉన్నాయ్. లేటెస్ట్ గా శ్రీలంకతో జరుగుతున్న వన్డే మ్యాచులో డేవిడ్ వార్నర్ (David Warner) ఫీట్ కూడా ఇలానే ఉంది. చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. డేవిడ్ బాయ్ ఫీట్ చూసి.. బౌలర్, మిగతా ఫీలర్లు కూడా కాసేపు షాక్ కు గురయ్యారు.

    వివరాల్లోకెళితే.. శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మంగళవారం జరిగిన తొలి వన్డే (Sri Lanka vs Australia)లో డేవిడ్ వార్నర్ ఓ చేతితో సూపర్ మ్యాన్ తరహాలో అద్భుత క్యాచ్ పట్టాడు. ఆస్ట్రేలియా బౌలర్ ఆష్టన్ అగర్ (Ashton Agar) వార్నర్ క్యాచ్ చూసి షాకయ్యాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లోఆష్టన్ అగర్ బౌలింగ్ లో ధనంజయ డి సిల్వా మిడాన్ మీదుగా బౌండరీ కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న వార్నర్..రైట్ సైడ్కి పరిగెత్తి..అమాంతం గాల్లోకి ఎగిరి బాల్ను ఎడమ చేత్తో అద్భుతంగా పట్టుకున్నాడు.



    బాల్ గాల్లోకి లేవగానే బాల్ వైపే చూస్తుండిపోయిన అగర్..వార్నర్ క్యాచ్ పట్టుకుంటాడని అస్సలు నమ్మలేదు. అయితే కరెక్ట్ టైమింగ్తో ఎగిరిన వార్నర్..కళ్లు చెదిరే విధంగా బంతిని అందుకుని ఆశ్చర్య పరిచాడు.ఈ క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్యాచ్ పై ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. సూపర్ మ్యాన్ కు అన్నలా ఉన్నాడంటూ చమత్కరిస్తున్నారు.


    ఇక, మూడు వన్డేల మ్యాచుల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. ఈ మ్యాచులో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 7 వికెట్లకు 300 పరుగులు చేసింది. కుషాల్ మెండిస్ 86 పరుగులు, పాతుమ్ నిశ్శంక 56 పరుగులు, గుణతిలక 55 పరుగులతో సత్తా చాటారు. అగర్, లబుషేన్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.


    ఆ తర్వాత వర్షం కారణంగా ఆసీస్ టార్గెట్ను 44 ఓవర్లలో 282 రన్స్కు అంపైర్లు కుదించారు. దీంతో ఛేజింగ్కు దిగిన ఆసీస్..42.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసి గెలిచింది. ఇక, ఆస్ట్రేలియా బ్యాటర్లలో మ్యాక్స్ వెల్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓ దశలో 189 పరుగులకే ఐదు వికెట్లు పడిపోయి కష్టాల్లో పడ్డ ఆస్ట్రేలియా తన సూపర్ బ్యాటింగ్ తో విజయతీరాలకు చేర్చాడు. 51 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఇందులో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయ్. స్టీవ్ స్మిత్ 53 పరుగులు, స్టొయినిస్ 44 పరుగులతో రాణించారు. వానిందు హసరంగ 4 వికెట్లు తీసినా.. శ్రీలంకను గెలిపించుకోలేకపోయాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Australia, Cricket, David Warner, Srilanka, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు