హోమ్ /వార్తలు /క్రీడలు /

AUS vs SL : ఆస్ట్రేలియాపై శ్రీలంక క్రికెట్ టీం అరాచకం.. అలా గెలిచిన తొలి జట్టుగా చరిత్ర..

AUS vs SL : ఆస్ట్రేలియాపై శ్రీలంక క్రికెట్ టీం అరాచకం.. అలా గెలిచిన తొలి జట్టుగా చరిత్ర..

శ్రీలంక జట్టు విజయానందం (PC : TWITTER)

శ్రీలంక జట్టు విజయానందం (PC : TWITTER)

AUS vs SL : తొలి రెండు టి20ల్లో ఓడిపోయి డీలా పడ్డ శ్రీలంక (Sri Lanka) జట్టు రెచ్చిపోయింది. స్వదేశంలో ఆస్ట్రేలియా (Australia) చేతిలో తొలి రెండు టి20ల్లో ఎదురైన పరాభవాలకు బదలు తీర్చుకుంది. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా జరిగిన తొలి రెండు టి20ల్లోనూ ఓడిన శ్రీలంక సిరీస్ ను ఇప్పటికే 0-2తో ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది.

ఇంకా చదవండి ...

AUS vs SL : తొలి రెండు టి20ల్లో ఓడిపోయి డీలా పడ్డ శ్రీలంక (Sri Lanka) జట్టు రెచ్చిపోయింది. స్వదేశంలో ఆస్ట్రేలియా (Australia) చేతిలో తొలి రెండు టి20ల్లో ఎదురైన పరాభవాలకు బదలు తీర్చుకుంది. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా జరిగిన తొలి రెండు టి20ల్లోనూ ఓడిన శ్రీలంక సిరీస్ ను ఇప్పటికే 0-2తో ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. మూడో టి20లో కూడా గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని భావించిన ఆసీస్ జట్టుకు ఊహించని రీతిలో శ్రీలంక గుణపాఠాన్ని నేర్పింది. శనివారం జరిగిన మూడో టి20లో ఆతిథ్య శ్రీలంక జట్టు 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (39), మార్కస్ స్టొయినస్ (38), స్టీవ్ స్మిత్ (37 నాటౌట్) రాణించారు. ఫలితంగా శ్రీలంక ముందు ఆసీస్ జట్టు భారీ స్కోరును ఉంచగలిగింది.

ఇది కూడా చదవండి : ఈ పాక్ బౌలర్ ను ఎవడికైనా చూపించండ్రా బాబు.. అలా వదిలేయకండి.. చాలా డేంజర్ గా ఉన్నాడు..

177 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆరంభంలో వరుసగా వికెట్లను కోల్పోయింది. దాంతో 17 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 6 వికెట్లకు 118 పరుగులు మాత్రమే చేసింది. లంకేయులు విజయం సాధించాలంటే చివరి మూడు ఓవర్లలో 59 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఆసీస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం అని అంతా అనుకున్నారు. అయితే ఇక్కడే అద్భుతం జరిగింది.​ శ్రీలంక కెప్టెన్‌ దాసున్‌ షనక (25 బంతుల్లో 54 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. చివరి మూడు ఓవర్లలో వరుసగా 22, 18, 19 పరుగులు రాబట్టిన శ్రీలంక 4 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఛేదనలో చివరి మూడు ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా శ్రీలంక నిలిచింది.

చివరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా.. కేన్ రిచర్డ్స్ సన్ బౌలింగ్ కు వచ్చాడు. తొలి రెండు బాల్స్ ను వైడ్ గా వేయగా.. ఆ తర్వాతి రెండు బంతులకు రెండు పరుగులు వచ్చాయి. దాంతో శ్రీలంక విజయం సమీకరణం 4 బంతుల్లో 15 పరుగులుగా మారింది. ఈ క్రమంలో స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న కెప్టెన్ షనక్.. వరుసగా 4, 4, 6 బాదాడు. దాంతో స్కోర్స్ సమం అయ్యాయి. ఇక ఆఖరి బంతికి ఒక్క పరుగుల కావాల్సిన తరుణంలో రిచర్డ్స్ సన్ వైడ్ వేశాడు. ఫలితంగా మరో బంతి మిగిలి ఉండగానే.. శ్రీలంక విజయాన్ని అందుకుంది. షనకకు ’ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‘ అవార్డు లభించింది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Australia, David Warner, Glenn Maxwell, Hardik Pandya, India vs South Africa, Sri Lanka, Team India

ఉత్తమ కథలు