Home /News /sports /

SIX OF THE NINE IPL FRANCHISES WINS BID IN LATEST T20 LEAGUE IN SOUTH AFRICA SAYS REPORT SJN

దక్షిణాఫ్రికాలో Mini IPL.. టి20 లీగ్ లో జట్లను సొంతం చేసుకునేందుకు రేసులో ఆరు ఐపీఎల్ ఫ్రాంచైజీలు

ఐపీఎల్ లోగో

ఐపీఎల్ లోగో

Cricket South Africa : దక్షిణాఫ్రికా వేదికగా వచ్చే ఏడాది కొత్త టి20 లీగ్ పురుడు పోసుకుంటున్న సంగతి తెలిసిందే. మొత్తం ఆరు జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. వీటి కోసం నిర్వాహకులు బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహించగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)కు చెందిన 9 ఫ్రాంచైజీలు వీటి కోసం బిడ్ వేసినట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
Cricket South Africa : దక్షిణాఫ్రికా వేదికగా వచ్చే ఏడాది కొత్త టి20 లీగ్ పురుడు పోసుకుంటున్న సంగతి తెలిసిందే. మొత్తం ఆరు జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. వీటి కోసం నిర్వాహకులు బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహించగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)కు చెందిన 9 ఫ్రాంచైజీలు వీటి కోసం బిడ్ వేసినట్లు తెలుస్తోంది. ఇందులో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఓనర్స్ ముఖేశ్ అంబానీతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఓనర్ ఎన్ శ్రీనివాసన్ లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ పార్థ్ జిందాల్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్స్ మారన్స్, లక్నో సూపర్ జెయింట్స్ కు ఓనర్ సంజీవ్ గొయెంకలతో పాటు రాజస్తాన్ రాయల్స్ కు చెందిన మనోజ్ బాదలే కూడా ఈ ఆరు ఫ్రాంచైజీల కోసం బిడ్స్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ నెల 13తో బిడ్డింగ్ ప్రక్రియ ముగిసింది.

ఇది కూడా చదవండి : హెర్నియా సర్జరీ తర్వాత ప్రాక్టీస్ మొదలు పెట్టిన టీమిండియా స్టార్.. మహిళా క్రికెటర్ తో కలిసి..

ఈ నెల ఆఖర్లో ఆరు ఫ్రాంచైజీలను సొంతం చేసుకున్న ఓనర్లను క్రికెట్ సౌతాఫ్రికా (CSA) ప్రకటించనుంది. ఇక ఈ ఫ్రాంచైజీల కోసం ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ కెవిన్ పీటర్స్ ను కూడా బిడ్ వేసినట్లు సమాచారం. అయితే అందుతున్న సమాచారం ప్రకారం భారత్ కు చెందిన ఆరు ఐపీఎల్ ఫ్రాంచైజీలకే ఆరు టీమ్ లు సొంతం అయినట్లు తెలుస్తోంది. వీరు కోట్ చేసిన అమౌంట్ కు ఇతర బిడ్డర్లు దరిదాపుల్లో కూడా రాలేదని సమాచారం. ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ ప్రాంచైజీని.. చెన్నై సూపర్ కింగ్స్ జొహన్నెస్ బర్గ్ ఫ్రాంచైజీని సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరు వీటి కోసం రూ. 250 కోట్ల బిడ్ వేసినట్లు సమాచారం.



ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని జిందాల్ కు సెంచూరియన్ ఫ్రాంచైజీ దక్కే అవకాశం ఉన్నట్లు అక్కడి నుంచి రిపోర్ట్స్ అందుతున్నాయి. దీనికి ప్రెటోరియా క్యాపిటల్స్ అని నామకరణం చేసే అవకాశం ఉందట. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్స్ చేతికి పోర్ట్ ఎలిజబెత్ ఫ్రాంచైజీ.. రాజస్తాన్ ఓనర్లు పార్ల్ టీంను సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ టి20 లీగ్ కూడా ఐపీఎల్ మోడల్ లోనే జరగనుంది. ఈ జట్లను సొంతం చేసుకున్న వారు 10 ఏళ్ల పాటు ఫ్రాంచైజీ ఫీజు కింద మొత్తం విలువలో ఏడాదికి 10 శాతాన్ని క్రికెట్ దక్షిణాఫ్రికాకు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ముంబై ఇండియన్స్ 250 కోట్లతో ఒక టీంను సొంతం చేసుకుంటే.. వారు ప్రతి ఏటా 25 కోట్ల చొప్పున క్రికెట్ దక్షిణాఫ్రికాకు 10 ఏళ్ల పాటు చెల్లించాల్సి ఉంటుంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, Delhi Capitals, Hardik Pandya, India Vs Westindies, IPL, IPL 2022, Mumbai Indians, Rishabh Pant, Rohit sharma, Sunrisers Hyderabad, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు