Home /News /sports /

SINGAPORE OPEN 2022 PV SINDHU SAINA NEHWAL AND HS PRANNOY ENTERS QUARTER FINAL SJN

Singapore Open 2022 : సింధు, సైనా అదరహో.. క్వార్టర్స్ లో ప్రవేశించిన భారత షట్లర్లు

పీవీ సింధు (ఫైల్ ఫోటో)

పీవీ సింధు (ఫైల్ ఫోటో)

Singapore Open 2022 : సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ (Singapore Open) టోర్నమెంట్ లో భారత (India) షట్లర్లు అదరగొడుతున్నారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు (PV Sindhu), సైనా నెహ్వాల్ (Saina Nehwal), హెచ్ ఎస్ ప్రణయ్ (HS Prannoy)లు తమ ప్రత్యర్థులపై విజయాలు సాధించి క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు.

ఇంకా చదవండి ...
Singapore Open 2022 : సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ (Singapore Open) టోర్నమెంట్ లో భారత (India) షట్లర్లు అదరగొడుతున్నారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు (PV Sindhu), సైనా నెహ్వాల్ (Saina Nehwal), హెచ్ ఎస్ ప్రణయ్ (HS Prannoy)లు తమ ప్రత్యర్థులపై విజయాలు సాధించి క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. మహిళల విభాగంలో గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్ లో పీవీ సింధు వియత్నాంకి చెందిన వరల్డ్ 59వ ర్యాంకర్ తుయ్ లిన్ గుయెన్‌పై 19-21, 21-19, 21-18 తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్ లో సైనా నెహ్వాల్ 21-19, 11-21, 21-17తో హె బింగ్ జియో (చైనా)పై అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక మరో తెలుగు ప్లేయర్ హెచ్ ఎస్ ప్రణయ్ 14-21, 22-20, 21-18తో చౌ తీన్ చెన్ (చైనీస్ తైపీ)పై గెలిచి ముందంజ వేశాడు.

గత కొంత కాలంగా గాయాలతో ఇబ్బంది పడుతూ ఫామ్ కోల్పోయి రిటైర్మెంట్ కు దగ్గర అయిన సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్స్ లో అసమాన పోరాటాన్ని ప్రదర్శించింది. తనకన్నా మెరుగైన హె బింగ్ జియోపై మూడు గేమ్ ల పాటు పోరాడి గెలిచింది. తొలి గేమ్ ను సొంతం చేసుకున్న సైనా.. రెండో గేమ్ లో మాత్రం తేలిపోయింది. దాంతో హె బింగ్ సులభంగా రెండో గేమ్ లో విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో మ్యాచ్ మూడో గేమ్ కు దారితీసింది. అందులో మరోసారి ఇరువురి మధ్య తీవ్ర పోటీ జరిగింది. చివరకు 58 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో సైనా విజయాన్ని అందుకుంది.



ఇక అదే సమయంలో మూడో సీడ్ పీవీ సింధు కూడా తన ప్రత్యర్థిపై విజయం సాధించడానికి చెమటోడ్చాల్సి వచ్చింది. వరల్డ్ 59వ ర్యాంకర్ తుయ్ లిన్ గుయెన్‌పై గెలిచేందుకు సింధు దాదాపు 66 నిమిషాల పాటు పోరాడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రతి గేమ్ కోసం సింధు పోరాడాల్సి వచ్చింది. చివరకు విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. పురుషుల విభాగంలో ప్రణయ్ విజయాన్నిఅందుకుని క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాడు. ఇక శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో హన్ య్యూ (చైనా)తో పీవీ సింధు; ఆయా ఒహోరితో సైనా నెహ్వాల్; కొడాయ్ నరౌకతో ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లో తలపడనున్నాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Badminton, India vs england, Pv sindhu, Saina Nehwal

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు