PV sindhu : గతేడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics)లో కాంస్య పతకం నెగ్గిన తర్వాత పెద్ద టోర్నీల్లో తెలుగు తేజం పీవీ సింధు (PV SIndhu) ఆశించిన స్థాయిలో ఆడలేకపోతుంది. ఇక ఈ ఏడాది జరిగిన సూపర్ 300 కేటగిరీ టోర్నీలు అయిన స్విస్ ఓపెన్, సయ్యద్ మోడి లను మాత్రమే సింధు సొంతం చేసుకుంది. అయితే తొలిసారి సూపర్ 500 టైటిల్ ను అందుకుంది. ఆదివారం సింగపూర్ ఓపెన్ లో చాంపియన్ గా అవతరించింది. మహిళల సింగిల్స్ విభాాగంలో జరిగిన ఫైనల్లో సింధు 21-9, 11-21, 21-15తో చైనాకు షట్లర్, ప్రపంచ 11 ర్యాంకర్ వాంగ్ జి యిపై అద్భుత విజయాన్ని సాధించింది. 58 నిమిషాల పాటు సాగిన ఈ తుది పోరులో ప్రత్యర్థిని ఓడించిన సింధు చాంపియన్ గా నిలిచింది.
ఆట ఆరంభం నుంచే ప్రత్యర్థిపై సింధు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలి గేమ్ లో ప్రత్యర్థికి కేవలం 9 పాయింట్లనే కోల్పోయిన ఆమె ఫైనల్ పోరును అద్భుతంగా ఆరంభించింది. అయితే రెండో గేమ్ లో వాంగ్ జి యి గోడకు కొట్టిన బంతిలా సింధుపై ఎదురుదాడికి దిగింది. దూకుడైన ఆటతో సింధును కోర్టులో నలువైపులా పరుగెత్తించింది. ఈ క్రమంలో రెండో గేమ్ ను వాంగ్ జి 21-11తో సొంతం చేసుకుంది. ఈ క్రమంలో చాంపియన్ ను తేల్చేందుకు మూడో గేమ్ అవసరం అయ్యింది. అయితే ఇక్కడ అద్భత ఆటతీరును కనబరిచిన సింధు ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ప్రత్యర్థిపై పైచేయి సాధించి ఈ ఏడాది తొలి సూపర్ 500 టైటిల్ ను అందుకుంది. గతంలోనూ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ లో కూడా వాంగ్ జి యి పై సింధు వరుస గేముల్లో నెగ్గడం విశేషం.
News Flash: 3rd TITLE of the year for Sindhu ????
P.V Sindhu wins Singapore Open title after beating WR 11 Wang Zhi Yi 21-9, 11-21, 21-15 in Final.
Earlier this year Sindhu won Swiss Open & Syed Modi International (both Super 300 level tournaments). #SingaporeOpen2022 pic.twitter.com/x1XMIfkMfo
— India_AllSports (@India_AllSports) July 17, 2022
అంతకుముందు జరిగిన సెమీఫైనల్ పోరుల్లో మూడో సీడ్ సింధు 21-15, 21-7తో సయిన కవాకమి (జపాన్)పై నెగ్గింది. మరో సెమీఫైనల్ పోరులో వాంగ్ 21-14, 21-14తో అయ ఒహోరిపై అద్భుత విజయాన్ని అందుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Badminton, India vs england, Pv sindhu, Saina Nehwal, Tokyo Olympics