శిఖర్ ధావన్‌ టెస్ట్‌ కెరీర్ ముగిసినట్టేనా??

భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో ఓపెనర్‌గా ఉన్న శిఖర్ ధావన్‌ ఇకపై టెస్ట్‌ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమనే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

news18-telugu
Updated: December 5, 2018, 4:43 PM IST
శిఖర్ ధావన్‌ టెస్ట్‌ కెరీర్ ముగిసినట్టేనా??
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ (Image: AP)
  • Share this:
టీమిండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ టెస్ట్ ఫార్మాట్‌లో ఆఖరి మ్యాచ్ ఆడేశాడా??? భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో ఓపెనర్‌గా ఉన్న ధావన్‌ ఇకపై టెస్ట్‌ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమనే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఇంగ్లండ్‌తో ముగిసిన 5 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఐదు టెస్ట్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన ధావన్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. టీమిండియా వంటి టాప్ ర్యాంక్ జట్టులో ఓపెనర్‌గా ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి..జట్టుకు శుభారంభాన్నివ్వాలి. ఒక్క ఇన్నింగ్స్‌ లో  కూడా స్థాయికి తగ్గట్టుగా ఇన్నింగ్స్ ఆడలేదు.భారీ స్కోర్లు చేయలేకున్నా మునుపటిలా దూకుడుగా ఆడటంలోనూ  ఈ స్టైలిష్ బ్యాట్స్‌మెన్ ఫెయిలయ్యాడు.
బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో విఫలమైన ధావన్‌కు..లార్డ్స్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టెస్ట్‌‌ ఆడిన తుది జట్టులో చోటు దక్కలేదు. అవకాశం దక్కిన నాలుగు టెస్ట్‌ల్లోని 8 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 162 పరుగులే చేయగలిగాడు. ఓ ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఒక్క ఇన్నింగ్స్‌లోనూ అర్ధసెంచరీ కూడా సాధించకపోవడం ధావన్‌కు ఇదే తొలి సారి.
బర్మింగ్ హామ్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో  26 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగులు చేశాడు.  ట్రెంట్ బ్రిడ్జ్ తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 44 పరుగులు స్కోర్ చేశాడు.  సౌతాంప్టన్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేశాడు. ఓవల్ టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 3, 1 పరుగులే చేయగలిగాడు.

తొలి మూడు టెస్ట్‌ల్లో విఫలమైన మరో ఓపెనర్‌ మురళీ విజయ్‌ను ఆఖరి రెండు టెస్ట్‌‌ల నుంచి బీసిసిఐ సెలక్టర్లు తప్పించారు.టెస్ట్ స్పెషలిస్ట్‌గా పేరున్న విజయ్‌..ట్రెడిషనల్ ఫార్మాట్‌లోనే టీమిండియా‌కు ఆడుతున్నాడు.ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ ఓపెనర్‌‌గా ఉన్న శిఖర్ ధావన్‌ ఇకపై వన్డే,టీ 20 ఫార్మాట్లలో మాత్రమే ఓపెనర్‌గా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ప్రస్తుతం టీమిండియా టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోవడానికి పోటీ పెరిగిపోతుండటంతో స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతున్న అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. 32 ఏళ్ల ధావన్ ఇప్పటివరకూ 34 టెస్ట్‌ల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 58 ఇన్నింగ్స్‌ల్లో 40.68 సగటుతో 7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలతో 2,315 పరుగులు చేశాడు.2013లో టెస్ట్ అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియాపై 187 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌తోనే అందరి దృష్టినీ ఆకర్షించాడు.భారత జట్టుకు అందుబాటులో ఉన్న అంతర్జాతీయ అనుభవం కలిగిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఓపెనర్‌ ధావన్ మాత్రమే కావడంతో ..టీమిండియా టెస్ట్ జట్టు నుంచి ఇప్పుడప్పుడే తొలగించే సాహసం చేయకపోవచ్చు.

 ఇవీ చదవండి:

ఇంగ్లండ్‌‌‌‌‌లో మరో సిరీస్ మిస్ చేసుకున్న ఇండియా

Loading...

ఇంగ్లండ్ టూర్‌లో విరాట్ సేన నాలుగు మ్యాచ్‌లే నెగ్గింది!!

First published: September 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...