2020లో తొలి ఐసీసీ టీ20 ర్యాంకులు...కోహ్లీ, శిఖర్ థావన్ జోరు

MRF Tyres ICC Men’s T20I Player Rankings | ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్ల ర్యాంకింగ్స్‌లో భారత ఓపనర్ కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో నిలిచాడు. టీమిండియాలో కేఎల్ రాహుల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

news18-telugu
Updated: January 11, 2020, 3:07 PM IST
2020లో తొలి ఐసీసీ టీ20 ర్యాంకులు...కోహ్లీ, శిఖర్ థావన్ జోరు
కెెఎల్ రాహుల్
  • Share this:
శ్రీలంకతో టీ20 సిరీస్‌ను 2-0తేడాతో టీమిండియా కైవసం చేసుకోవడంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను భారత క్రికెటర్లు మెరుగుపరుచుకున్నారు. 2020 సంవత్సరంలో ఐసీసీ తొలి టీ20 ర్యాంకింగ్స్‌ శనివారం విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో భారత ఓపనర్ కేఎల్ రాహుల్ అదనంగా 26 పాయింట్లు పొంది మొత్తం 760 రేటింగ్ పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. టీమిండియా ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

టీ20 ర్యాంకుల్లో విరాట్ కోహ్లీ, శిఖర్ థావన్ కూడా తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. టెస్ట్, వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలుస్తున్న కోహ్లీ...టీ20 ర్యాంకింగ్స్‌లో 683 పాయింట్లతో ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని 9వ స్థానంలో నిలిచాడు. శిఖర్ థావన్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని 15వ స్థానానికి ఎగబాకాడు. పాక్ ఆటగాడు బాబర్ అజమ్(879 పాయింట్లు) అగ్రస్థానంలోనూ... ఫించ్(810) రెండో స్థానంలో నిలిచారు.


భారత ఫాస్ట్ బౌలర్లు కూడా టీ20 ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా ఎనిమిది స్థానాలు మెరుగుపరుచుకుని మొత్తం 524 పాయింట్లతో 39వ ర్యాంకులో నిలిచాడు.

శ్రీలంకతో జరిగిన మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా..మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ కోహ్లీసేన విజయం సాధించడం తెలిసిందే.
First published: January 11, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు