ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరే టీమిండియా పురుష, మహిళా క్రికెటర్ల కఠిన క్వారంటైన్ ప్రారంభమైంది. కెప్టెన్ కోహ్లి, పరిమిత ఓవర్ల ఉపసారథి రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రవిశాస్త్రితోపాటు అందరూ బయో బబుల్‌లోకి వెళ్లారని బిసిసిఐ ట్విట్టర్ వేదికగా తెలిపింది. అలాగే మహిళా క్రికెటర్లు తొలిసారి కఠిన క్వారంటైన్లోకి వెళ్ళారని, వీరందరూ 8రోజుల క్వారంటైన్లో ఉండనున్నారని పేర్కొంది. ఇక ముంబయి విమానాశ్రయానికి సమీపంలోని గ్రాండ్ హయత్ హోటల్లో క్రికెటర్ల కోసం బిసిసిఐ ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేసింది. జూన్ 2న భారతజట్లు ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరి వెళ్ళనున్నాయి. క్వారంటైన్ కాలంలో వీరందరికీ మూడుసార్లు ఆర్టీపిసిఆర్ టెస్ట్‌లు జరపనున్నారు. జూన్ 16నుంచి భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌తో ఒక టెస్ట్, మూడు వన్డేలు, మూడు టి20లు ఆడనుంది. ఇక, ముంబైలోని హోటల్ లో ఉన్న టీమిండియా మహిళా క్రికెటర్లు జిమ్ లో కసరత్తులు ఇరగదీస్తున్నారు. కఠిన క్వారంటైన్ లోనూ చెమట చిందిస్తున్నారు. ఫిట్‌గా ఉండేందుకు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. క్వారంటైన్లో బోర్ కొట్టకుండా జిమ్‌లో వర్కౌట్స్‌తో సమయాన్ని గడుపుతున్నారు. మహిళా క్రికెటర్లు జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా తీసిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘షట్ ది నాయిస్! వుయ్ ఆర్ ఇండియా’ అని వ్యాఖ్యానించింది.
ఈ వీడియోలో కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ, రాధా యాదవ్, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ, జూలన్ గోస్వామి, ఎక్తా బిష్త్ తదితరులు వర్కౌట్స్ చేస్తూ చెమటోడ్చుతున్నారు. పెద్ద పెద్ద బరువులు ఎత్తుతూ.. బౌలింగ్ యాక్షన్ ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.
Shut the Noise! We are INDIA ?? #TogetherWeWin pic.twitter.com/5b2jFYQBIT
— BCCI Women (@BCCIWomen) May 27, 2021
ఈ పర్యటనలో భారత మహిళలు ఇంగ్లండ్‌తో ఓ టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్ జూన్ 16 నుంచి ప్రారంభంకానుంది. పురుష క్రికెటర్లతో కలిసి భారత మహిళలు జూన్ 2 ఇంగ్లండ్‌కు పయనం కానున్నారు. అక్కడ 10 రోజుల ఐసోలేషన్‌లో ఉండనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, India vs england, Mithali Raj, Team India, Viral Video, Women's Cricket