• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • SHREYAS IYER UNDERGONE A SUCCESSFUL SURGERY FOR SHOULDER INJURY AND HE THINKS COME BACK INTO TEAM INDIA SRD

Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ భుజానికి సర్జరీ సక్సెస్.. సింహంలా వస్తానంటూ..

Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ భుజానికి సర్జరీ సక్సెస్.. సింహంలా వస్తానంటూ..

Photo Credit : Twitter

Shreyas Iyer : మార్చి 23న పుణె వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన తొలి వన్డేలో శ్రేయస్​ గాయపడ్డాడు. ఐపీఎల్​లో ఢిల్లీ క్యాపిటల్స్​ (DC)కు కెప్టెన్​గా వ్యవహరించిన అయ్యర్​.. గాయం కారణంగా లీగ్​కు దూరమయ్యాడు.

  • Share this:
    ఇంగ్లండ్ సిరీస్ లో మొదటి వన్డే సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సర్జరీ పూర్తైంది. భుజం గాయం కారణంగా ఐపీఎల్ (IPL 2021) కు దూరమైన శ్రేయస్ కు ఈ రోజు శస్త్రచికిత్స నిర్వహించారు వైద్యులు. మార్చి 23న పుణె వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన తొలి వన్డేలో శ్రేయస్​ గాయపడ్డాడు. జులై 23 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లిష్​ కౌంటీల్లో లాంక్​షైర్​ తరఫున ఆడనున్నాడు శ్రేయస్​. కానీ, సర్జరీ తర్వాత నాలుగు నెలలు ఆటకు దూరంగా ఉండాల్సి ఉంది. నాలుగు నెలల పాటు పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఇక, తనకు సర్జరీ జరిగిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు శ్రేయస్. త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. " శస్త్రచికిత్స సక్సెస్ గా పూర్తైంది. గర్జించే సింహాంలా మళ్లీ జట్టులోకి వస్తా. మీ అందరి అభిమానానికి ధన్యావాదాలు " అంటూ కామెంట్ చేశాడు శ్రేయస్.

    ఐపీఎల్​లో ఢిల్లీ క్యాపిటల్స్​ (DC)కు కెప్టెన్​గా వ్యవహరించిన అయ్యర్​.. గాయం కారణంగా లీగ్​కు దూరమయ్యాడు. అతని స్థానంలో రిషభ్ పంత్​ను సారథిగా నియమించింది డీసీ. ఈ సారి పంత్ కెప్టెన్సీలో కప్ కొట్టాలని ఉవ్విల్లూరుతోంది ఢిల్లీ క్యాపిటల్స్. మరోవైపు, ఢిల్లీ యజమాన్యం పట్ల ఉదారత చూపించింది ఢిల్లీ ఫ్రాంచైజీ.


    ఈ ఏడాది కాంట్రాక్ట్ డబ్బులను శ్రేయస్ కు చెల్లించనున్నట్లు తెలిపింది ఢిల్లీ. అలాగే, అతడి వైద్య చికిత్సలకు అవసరమయ్యే ఖర్చు మొత్తం భరిస్తామని హామీ ఇచ్చింది. శ్రేయస్ లాంటి కెప్టెన్ సేవలు కోల్పోవడం ఢిల్లీకి మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. గతేడాది.. శ్రేయస్ కెప్టెన్సీలో ఢిల్లీ ఫైనల్ కు చేరింది. అయితే ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. శ్రేయస్ సేనను ఓడించి..రికార్డు స్థాయిలో ఐదో టైటిల్ ను కైవసం చేసుకుంది ముంబై ఇండియన్స్.
    Published by:Sridhar Reddy
    First published: