ఇండియా - న్యూజీలాండ్ (India vs New Zealand) మధ్య తొలి టెస్టు గురువారం కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో ప్రారంభం కానున్నది. సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) విశ్రాంతి తీసుకోవడం... కేఎల్ రాహుల్ (KL Rahul) గాయంతో టెస్టు సిరీస్‌కు దూరమవడంతో భారత జట్టు (Team India) ఓపెనింగ్, మిడిలార్డ్ కూర్పు ఎలా ఉండబోతుందని అందరూ భావించారు. మ్యాచ్ మరి కొన్ని గంటల్లో ప్రారంభం అవుతుందనగా కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane) రేపటి జట్టుపై క్లారిటీ ఇచ్చాడు. యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌ను (Shreyas Iyer) టెస్ట్ మ్యాచ్ తుది జట్టులోకి తీసుకోనున్నట్లు చెప్పాడు. శ్రేయస్ అయ్యర్ టీమ్ ఇండియా తరపున టెస్టు మ్యాచ్ ఆడబోతున్న 303వ క్రికెటర్‌గా గుర్తింపు పొందనున్నాడు. టీమ్ ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్, ఐపీఎల్‌లో మంచి మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా రాణించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఒక వన్డే మ్యాచ్‌లో గాయపడటంతో ఐపీఎల్ 2021 తొలి ఫేజ్‌కు దూరమయ్యాడు. శస్త్ర చికిత్స అనంతరం కోలుకున్న శ్రేయస్.. తిరిగి జట్టులోకి వచ్చాడు.
టీమ్ ఇండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ టెస్టు సిరీస్‌కు అందుబాటులో లేకపోవడంతో శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్ జోడి టెస్టుల్లో ఓపెనింగ్ చేయనున్నది. ఇక 3వ స్థానంలో వచ్చే కోహ్లీ తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. అతడి స్థానంలో అజింక్య రహానే లేదా చతేశ్వర్ పుజార బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉన్నది. మిడిల్ ఆర్డర్‌లో రిషబ్ పంత్‌కు విశ్రాంతిని ఇచ్చారు. అతడి బదులు వృద్దిమాన్ సాహ జట్టులో ఉంటాడు. అయితే హనుమ విహారిని టెస్టు జట్టుకు ఎంపిక చేయలేదు. దీంతో శ్రేయస్ అయ్యర్ లేదా సూర్యకుమార్ యాదవ్‌లో ఒకరికి చోటు ఇవ్వాల్సి ఉన్నది. అయితే కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ అజింక్య రహానే ఆ స్థానంలో అయ్యర్ అయినే మంచి చాయిస్ అని నిర్ణయించారు. ఆ మేరకు రహానే అయ్యర్ అరంగేట్రం గురించి ప్రకటన చేశాడు.
Diego Maradona: మారడోనా నాపై అత్యాచారం చేశాడు.. నా బాల్యాన్ని లాగేసుకున్నాడు.. మహిళ ఆరోపణ
ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్‌లు బౌలింగ్ విభాగాన్ని లీడ్ చేస్తారు. సిరాజ్ పూర్తి ఫిట్‌గా లేకపోతే ఉమేష్ యాదవ్‌కు చోటు దక్కుతుంది. ఒకవేళ ద్రవిడ్ కొత్త వారికి అవకాశం ఇవ్వాలనుకుంటే ప్రసిధ్ కృష్ణ తుది జట్టులో ఉండే అవకాశం ఉన్నది. కాన్పూర్ పిచ్ కొద్దిగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. దీంతో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లో ఎవరికి చోటు దక్కుతుందనేని తేలాల్సి ఉన్నది. ఇంగ్లాండ్ సిరీస్‌లో అక్షర్ పటేల్ విశేషంగా రాణించాడు. దీంతో అశ్విన్‌తో పాటు అక్షర్‌కు చోటు దక్కవచ్చు. ఒకవేళ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలనుకుంటే వీరిద్దరితో పాటు రవీంద్ర జడేజాకు కూడా చోటు దక్కుతుందని విశ్లేషకులు బావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India vs newzealand, Shreyas Iyer, Team India, Test Cricket