Home /News /sports /

Shreyas Iyer Debut Century: తొలి టెస్టులోనే సెంచరీతో సంచలనం సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. కివీస్‌పై రికార్డు

Shreyas Iyer Debut Century: తొలి టెస్టులోనే సెంచరీతో సంచలనం సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. కివీస్‌పై రికార్డు

అరంగేట్రం టెస్టులోనే సెంచరీ బాదిన శ్రేయస్ అయ్యర్ (PC: BCCI)

అరంగేట్రం టెస్టులోనే సెంచరీ బాదిన శ్రేయస్ అయ్యర్ (PC: BCCI)

Shreyas Iyer: అరంగేట్రం టెస్టులోనే శ్రేయస్ అయ్యర్ సెంచరీ చేశాడు. కాన్పూర్ వేదికగా న్యూజీలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండవ రోజు శ్రేయస్ అయ్యర్ సెంచరీ కొట్టాడు. తొలి రోజు 75 పరుగులతో నాటౌట్‌గా ఉన్న అయ్యర్.. రెండో రోజు మిగిలిన పరగులు కొట్టి తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు.

ఇంకా చదవండి ...
    టీమ్ ఇండియా (Team India) అరంగేట్రం బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆడిన తొలి టెస్టులోనే సెంచరీతో (Century) సంచలనం సృష్టించాడు. పేటీఎం (PayTm) టెస్ట్ సిరీస్‌లో భాగంగా న్యూజీలాండ్‌తో (New Zealand) తొలి టెస్టు కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్నది. సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), కేఎల్ రాహుల్ (KL Rahul), విరాట్ కోహ్లీ (Virat Kohli) అందుబాటులో లేకపోవడంతో శ్రేయస్ అయ్యర్‌కు తుది జట్టులో స్థానం దక్కింది. తొలి రోజు భారత జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కివీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కుంటూ హాఫ్ సెంచరీ సాధించాడు. రవీంద్ర జడేజాతో కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి తొలి రోజు భారత జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు. తొలి రోజు ముగిసే సరికి శ్రేయస్ అయ్యర్ 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

    ఇక రెండు రోజు ఆటలో శ్రేయస్ అయ్యర్ తన ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. టిమ్ సౌథీ వేసిన ఇన్నింగ్స్ 91.1 బంతికి రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన 16వ ఇండియన్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. శ్రేయస్ అయ్యర్ 156 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. ఇందులో 13 ఫోర్లు 2 సిక్సులు ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ టీమ్ ఇండియా తరపున తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన 16వ బ్యాటర్‌గా, తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసిన 13వ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

    Tim Paine: క్రికెట్‌కు టిమ్ పైన్ గుడ్ బై? అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోనున్న ఆసీస్ మాజీ కెప్టెన్.. సెక్స్ స్కాండలే కారణమా?







    ఇక స్వదేశంలో అరంగేట్రం చేసిన టెస్టులో సెంచరీ చేసిన 10వ బ్యాటర్‌ శ్రేయస్అయ్యర్. ఇక కాన్పూర్ వేదికగా జరిగిన టెస్టుల్లో అరంగేట్రం చేసి టెస్టు సెంచరీ చేసిన రెండో బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. అంతకు ముందు గుండప్ప విశ్వనాథన్ అరంగేట్రం సెంచరీ కాన్పూర్‌లో సాధించాడు. న్యూజీలాండ్ జట్టుపై డెబ్యూ సెంచరీ చేసిన మూడవ బ్యాటర్‌గా అయ్యర్ రికార్డు సృష్టించాడు. కాగా, టీమ్ ఇండియా తరపున డెబ్యూ మ్యాచ్‌లో సెంచరీలు చేసిన చివరి ముగ్గురు బ్యాటర్లు కూడా ముంబైకి చెందిన వాళ్లే కావడం గమనార్హం. రోహిత్ శర్మ, పృథ్వీషా తర్వాత శ్రేయస్ అయ్యర్ ఆ జాబితాలో చేరాడు.

    Shreyas Iyer: నాలుగేళ్ల పాటు వాట్సప్ డీపీ మార్చని శ్రేయస్ తండి.. ఇంతకు ఆ పిక్చర్ ఏంటి? దాని వెనుక స్టోరీ ఏంటి?







    ఇక కాన్పూర్ టెస్టులో భారత జట్టు 258/4 ఓవర్ నైట్ స్కోర్‌‌తో బ్యాటింగ్ ప్రారంభించి నిలకడగా ఆడింది. ఓవర్ నైట్ స్కోర్‌కు కేవలం 8 పరుగులు జోడించిన అనంతరం రవీంద్ర జడేజా (50) టిమ్ సౌథీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సాహ పూర్తిగా నిరాశ పరిచాడు. సాహ (1) టిమ్ సౌథీ బౌలింగ్‌లో బ్లండెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్‌ 105 పరుగుల వద్ద టిమ్ సౌథీ బౌలింగ్‌లో యంగ్‌కు క్యాచ్ఇచ్చి అవుటయ్యాడు. 96.1 ఓవర్లు ముగిసే సరికి ఇండియా 306/7 స్కోర్ వద్ద ఉన్నది. అశ్విన్ 16 బ్యాటింగ్ క్రీజులో ఉన్నాడు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:John Kora
    First published:

    Tags: India vs newzealand, Shreyas Iyer, Team india, Test Cricket

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు