కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో న్యూజీలాండ్‌తో (New Zealand) జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా (Team India) పట్టు భిగించింది. నాలుగవ రోజు తొలి సెషన్‌లో వరుసగా వికెట్లు కోల్పోయిన భారత జట్టును శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), వృద్దిమాన్ సాహ (Wruddiman Saha), రవిచంద్రన్ అశ్విన్‌లు (Ravichandran Ashwin) కాపాడి చక్కని టార్గెట్ సెట్ చేశారు. న్యూజీలాండ్ విజయానికి 284 పరుగులు చేయాల్సి ఉండగా ప్రస్తుతం 4/1 స్కోర్ వద్ద ఉన్నది. భారత జట్టు మరో 9 వికెట్లు తీస్తే తొలి టెస్టులో విజయం సాధిస్తుంది. సోమవారం ఉదయం సెషన్ ఇరు జట్లకు కీలకంగా ఉండబోతున్నది. అయితే భారత జట్టు నాలుగో రోజు వరుసగా వికెట్లు పడేసుకున్నా.. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టిన శ్రేయస్ అయ్యర్ రెండో ఇన్నింగ్స్‌లో సమయోచితంగా ఆడాడు. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా సాధ్యమైనంత సేపు క్రీజులో పాతుకొని పోయి పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తానికి రెండవ ఇన్నింగ్స్‌లో కీలకమైన 65 పరుగులు జోడించి అవుటయ్యాడు. అయితే శ్రేయస్ అయ్యర్ ఇప్పటి వరకు ఏ టీమ్ ఇండియన్ క్రికెటర్ అందుకోని అరుదైన టెస్ట్ రికార్డును నమోదు చేశాడు.
టెస్టుల్లో అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే ఒక సెంచరీతో పాటు మరో అర్ద సెంచరీ నమోదు చేసిన ఏకైక భారత క్రికెటర్‌గా అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు అరంగేట్రం టెస్టులో సెంచరీలు చేసిన ఇండియన్స్ 16 మంది ఉన్నారు. కానీ వాళ్లెవరూ మరో ఇన్నింగ్స్‌లో అర్ద సెంచరీ చేయలేదు. ఇక మొత్తంగా చూసుకుంటే అంతర్జాతీయ క్రికెట్లలో గతంలో 9 మంది మాత్రమే ఈ ఫీట్ సాధించగా.. శ్రేయస్ అయ్యర్ 10వ క్రికెటర్‌గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ తొలి ఇన్నింగ్స్‌లో 105, రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు.
KS Bharat: 10 ఏళ్ల పాటు డేటింగ్ చేసి.. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న కేఎస్ భరత్
Shreyas Iyer departs after a fine innings of 65 and that will be Tea on Day 4 of the 1st Test.#TeamIndia lead by 216 runs. How many more will they add to this tally in the final session?
Scorecard - https://t.co/WRsJCUhS2d #INDvNZ @Paytm pic.twitter.com/tfubs67ESF
— BCCI (@BCCI) November 28, 2021
ఇక డెబ్యూ మ్యాచ్‌లలో రెండు అర్ద సెంచరీలు సాధించిన భారత క్రికెటర్లు ఇద్దరే ఉన్నారు. 1933-34 సీజన్‌లో దిలావర్ హుస్సేన్ (59, 57) సాధించగా.. 1970-71 సీజన్‌లో భారత క్రికెటర్ సునీల్ గవాస్కర్ వెస్టిండీస్ మీద అరంగేట్రం మ్యాచ్‌లో 65, 67 నాటౌట్ ఫీట్ సాధించాడు. అయితే వీరిద్దరి రికార్డును శ్రేయస్ అయ్యర్ సవరించాడు. ఇక అరంగేట్రం టెస్టులోనే అత్యధిక పరుగులు చేసిన టీమ్ ఇండియా బ్యాటర్లలో అయ్యర్ మూడో స్థానంలో నిలిచాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 170 పరుగులు చేశాడు. అయితే శిఖర్ ధావన్ తన అరంగేట్రం టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులు చేశాడు. కానీ రెండో ఇన్నింగ్స్ ఆడలేదు. ఇక రోహిత్ శర్మ వెస్టిండీస్‌పై 177 పరుగులు చేశాడు. రోహిత్ కూడా సెకెండ్ ఇన్నింగ్స్ఆడలేదు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India vs newzealand, Team India