హోమ్ /వార్తలు /క్రీడలు /

Shreyas Iyer: నాలుగేళ్ల పాటు వాట్సప్ డీపీ మార్చని శ్రేయస్ తండి.. ఇంతకు ఆ పిక్చర్ ఏంటి? దాని వెనుక స్టోరీ ఏంటి?

Shreyas Iyer: నాలుగేళ్ల పాటు వాట్సప్ డీపీ మార్చని శ్రేయస్ తండి.. ఇంతకు ఆ పిక్చర్ ఏంటి? దాని వెనుక స్టోరీ ఏంటి?

నాలుగేళ్ల పాటు ఆ వాట్సప్  డీపీ మార్చని శ్రేయస్ అయ్యర్ తండ్రి (PC: Instagram)

నాలుగేళ్ల పాటు ఆ వాట్సప్ డీపీ మార్చని శ్రేయస్ అయ్యర్ తండ్రి (PC: Instagram)

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ తాజాగా టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. న్యూజీలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అతడికి అవకాశం దక్కింది. ఆడిన మొదటి మ్యాచ్‌లోనే తన టాలెంట్ నిరూపించుకున్నాడు. అయితే ఈ క్షణం కోసం ఎదురు చూసిన శ్రేయస్ తండ్రి సంతోశ్ అయ్యర్ నాలుగేళ్లుగా వాట్సప్ డీపీ మార్చలేదంటా. ఎందుకో తెలుసా?

ఇంకా చదవండి ...

సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సప్‌ను (WhatsApp) ఈ రోజు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ (Smart Phone) ఉన్న ప్రతీ ఒక్కరి దగ్గర ఆ యాప్ ఉంటుంది. చాలా మంది ఆ వాట్సప్ డీపీలను తరచుగా మారుస్తుంటారు. మహా అయితే ఒక ఆర్నెల్లో ఏడాది పాటో ఉంచుకునే వాళ్లు ఉంటారు. కానీ టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తండ్రి సంతోశ్ అయ్యర్ మాత్రం ఒక డీపీని ఏకంగా నాలుగేళ్ల పాటు అలానే ఉంచేశాడు. 2017లో పెట్టిన ఆ డీపీని అలా కొనసాగిస్తూ తన కొడుకు శ్రేయస్‌లో స్పూర్తి నింపాడు. ఇంతకు ఆ డీపీ ఏంటంటే.. శ్రేయస్ అయ్యర్ 2017లో ఆస్ట్రేలియాతో (Australia) జరిగిన సిరీస్ గెలిచి బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని (Border Gavaskar Trophy) దక్కించుకున్నది. ఆ సమయంలో ట్రోఫీని పట్టుకొని తెల్లని జెర్సీలో ఫొటో దిగాడు. అదే ఫొటోనే సంతోశ్ అయ్యర్ నాలుగేళ్ల పాటు కొనసాగించాడు. తన కుమారుడు ఏనాటికైనా తెల్లని జెర్సీలో టీమ్ ఇండియా  (Team India) కోసం క్రికెట్ ఆడాలని కలలు కన్నాడు. ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు తన కుమారుడికి తెలియజేయాలనే తపనతోనే ఆ డీపీని మార్చకుండా ఉంచేశాడు.

శ్రేయస్ అయ్యర్ 2017లో తొలి సారి టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీకి బ్యాకప్‌గా అయ్యర్ ఎంపికయ్యాడు. కానీ శ్రేయస్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. దీంతో అతడి టెస్ట్ అరంగేట్రం కలగా మారింది. ఆ తర్వాత అయ్యర్‌కు తెల్ల జెర్సీ వేసుకునే ఛాన్సే రాలేదు. తాజాగా టీమ్ ఇండియా టెస్టు జట్టులో స్థానం సంపాదించి.. కాన్పూర్‌లో న్యూజీలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అరంగేట్రం చేశాడు. ఇప్పుడు కూడా కోహ్లీ గైర్హాజరీలో అతడి ప్లేస్‌లోనే జట్టులోకి రావడం ఒక విశేషం. ఇంకొంక విశేషం ఏంటంటే.. శ్రేయస్ అయ్యర్ తన తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలోనే దిగ్గజ క్రికెటర్ సునిల్ గవాస్కర్ చేతుల మీదుగా టెస్ట్ క్యాప్ అందుకోవడం. అందుకే టెస్టు క్యాప్ అందుకున్న వెంటనే అయ్యర్ భావోద్వేగానికి గురయ్యాడు.

Team India Daughters: టీమ్ ఇండియా క్రికెటర్లంటే ఆడపిల్లలకు తండ్రులే.. కావాలంటే ఇదిగో రుజువు


శ్రేయస్ అయ్యర్ తండ్రి సంతోశ్ నాలుగేళ్ల పాటు డీపీగా ఉంచుకున్న ఫొటో ఇదే (PC: Shreyas Iyer/Facebook)

ఆడిన తొలి టెస్ట్ లోనే శ్రేయస్ అయ్యర్ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇద్దరు ఓపెనర్లతో పాటు నయా వాల్ చతేశ్వర్ పుజార అవుటై భారత జట్టు 106/3 స్కోరుతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్రీజు వద్దకు వచ్చాడు. జేమిసన్, సౌథీ వంటి బౌలర్లు తమ స్వింగ్‌తో భారత బ్యాటర్లను భయపెడుతున్న సమయంలో వచ్చి కూల్‌గా తన పని తాను చేసుకొని పోయాడు. తొలి పరుగు కోసం చాలా సమయం తీసుకున్నా.. ఆ తర్వాత ఇక శ్రేయస్ అయ్యర్ ఆగలేదు. కివీస్ బౌలర్లపై ఎటాక్ చేసి బౌండరీలు, సిక్సులతో మోత మోగించాడు. తొలి మ్యాచ్‌లోనే అర్ద సెంచరీ పూర్తిచేసుకొని 75 నాటౌట్‌గా నిలిచి ఇంకా క్రీజులో ఉన్నాడు. రవీంద్ర జడేజాతో కలసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇంకా శ్రేయస్ అయ్యర్ పని పూర్తి కాలేదు. మరో పాతిక పరుగులు చేస్తే తొలి టెస్టులోనే సెంచరీ చేసిన ఘనతను అందుకోవడానికి సిద్దంగా ఉన్నాడు.

Shreyas Gopal: ఒక కంపెనీ సీఈవో అయిన తన గర్ల్ ఫ్రెండ్ నికితను పెళ్లి చేసుకున్న ఆల్‌రౌండర్ శ్రేయస్ గోపాల్ - Photos


ఇక వాట్సప్ డీపీ నాలుగేళ్ల పాటు ఉంచడంపై శ్రేయస్ తండ్రి సంతోశ్ ఇలా చెప్పాడు. 'బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీతో దిగిన ఫొటో నాకు చాలా ఇష్టం. అది నా మనసుకు ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది. అతను ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపికైన సమయంలో విరాట్ కోహ్లీకి బ్యాకప్‌గా ఎంపికయ్యాడు. అది ధర్మశాలలో జరిగిన మ్యాచ్. ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత జట్టు ఆ ట్రోఫీని శ్రేయస్ అయ్యర్ చేతిలో పెట్టింది. అతను ఆ ట్రోఫీ పట్టుకున్న సందర్భం నాకు చాలా గొప్పగా అనిపించింది. ఏనాటికైనా శ్రేయస్ టెస్టుల్లో ఆడాలని నేను కోరుకున్నాను. అందుకే ఆ డీపీని అలా ఉంచేశాను' అని చెప్పుకొచ్చాడు.

First published:

Tags: India vs newzealand, Shreyas Iyer, Team India, Test Cricket, Virat kohli

ఉత్తమ కథలు