హోమ్ /వార్తలు /క్రీడలు /

Breaking News: టీమిండియాకు షాక్.. భారత క్రికెటర్ కు కరోనా.. వన్డే సిరీస్ కు దూరం

Breaking News: టీమిండియాకు షాక్.. భారత క్రికెటర్ కు కరోనా.. వన్డే సిరీస్ కు దూరం

టీమిండియా క్రికెటర్ కు పాజిటివ్

టీమిండియా క్రికెటర్ కు పాజిటివ్

Breaking News: భారత్ క్రికెట్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. వన్డే సిరీస్ కు ముందే ఫాంలో ఉన్న క్రికెటర్ భారత జట్టుకు దూరమయ్యారు.. తాజాగా జరిపిన పరీక్షల్లో అతడికి కరోనా పాజటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇతర క్రికెటర్లలోనూ భయం పెరిగింది.

ఇంకా చదవండి ...

Breaking News:  భారత దేశంలో కరోనా వైరస్ (Corona Virus) విస్తరిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. ప్రతి రోజు లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఆ ప్రభావం భారత క్రికెట్ జట్టు (Team India) పైనా పడింది. దక్షిణాఫ్రికా (South Africa) తో వన్డే సిరీస్ కు ఎంపికైనా టీమిండియా క్రికెటర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sunder) కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. అతడికి కరోనా సోకినా ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు లేవు. ప్రస్తుతం సుందర్‌ హోం ఐసోలేషన్‌ లో ఉన్నాడు. ఈ విషయాన్ని స్వయంగా క్రికెటర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ తన సోషల్‌ మీడియాలో పేర్కొన్నాడు.  ఈ మధ్య తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలిన కోరాడు.

క్రికెటర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కు కరోనా సోకడంతో.. సౌతాఫ్రికా జట్టుతో జరిగే… వన్డే సిరీస్‌ కు దూరం అయ్యే అవకాశం ఉంది. వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో మరొకరికి చాన్స్‌ దక్కనుంది. ప్రస్తుతం టెస్టు సిరీస్ లో భాగంగా ఆకరి మ్యాచ్ జరుగుతోంది. మరో వారం తరువాత వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్ మధ్య నాటికి సుందర్ కోలుకున్నా.. క్వారంటైన్ కాలం పూర్తైనా అందుబాటులోకి రావడం కష్టమే..  దీంతో ప్రత్యామ్నాయాలపై బీసీసీఐ ఫోకస్ చేస్తోంది.

టీమిండియా ఆల్ రౌండర్ ఇలా కరోనా బారిన పడడం జట్టుకు కాస్త ఇబ్బంది కలిగించే అంశమే. దీంతో జనవరి 19 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ (SA vs IND) కు అతడు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. ఇతర జట్టు సభ్యులతో కలిసి ఈ 22 ఏళ్ల స్పిన్నర్ కేప్ టౌన్ వెళ్లేందుకు అవకాశం లేనట్టే.. అయితే తనకు కరోనా సోకింది అని చెప్పిన వాషింగ్టన్.. తాను సౌతాఫ్రికాకు వెళ్లేది లేదా అన్నదాని క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (BCCI President Ganguly) కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి : మేఘాన్ని ముద్దాడే కొండలు.. ఆ అందాలు చూడతరమా.. ఇక్కడో కాదు మన దగ్గరే

రెండేళ్లుగా దేశీయ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న సుందర్ (Washington Sundar).. ప్రోటీస్ తో సిరీస్ లో తనదైన ముద్ర వేయాలనుకున్నాడు. ఇది అతని కెరీర్ కు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. సెలెక్టర్లు సుందర్ కోలుకునే దాకా వేచి చూస్తారా లేదా మరోకరిని ఎంపిక చేస్తారా అన్నది చూడాలి. ఈ వన్డే సిరిస్ కు రాహుల్ (KL Rahul) కెప్టెన్ గా వ్యవహారిస్తున్నాడు.

ఇదీ చదవండి : సంక్రాంతి స్పెషల్ సున్నుండలు తో ఇన్ని ప్రయోజనాలా..? పిల్లలు తినొచ్చా..?

దక్షిణాఫ్రికాతో తలపడే భారత జట్టు ఇదే.. : కె.ఎల్ రాహుల్ కెప్టెన్( KL Rahul), శిఖర్ ధావన్ (Shikhar Dhawan), రుతురాజ్ గ్వైకాడ్ ( Ruturaj Gaikwad), విరాట్ కోహ్లీ ( Virat Kohli), Shreyas Iyer, Suryakumar Yadav, Venkatesh Iyer, Rishabh Pant, ఇషాన్ కిషన్ (Ishan Kishan) , ఆర్.అశ్విన్ (R Ashwin), యుజేంద్ర చాహల్( Yuzvendra Chahal), వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar), జస్ ప్రీత్ బూమ్రా వైస్ కెప్టెన్ (Jasprit Bumrah), భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar), దీపక్ చాహర్ ( Deepak Chahar), ప్రసిద్ క్రిష్ణ (Prasidh Krishna), శార్ధూల్ ఠాకూర్ ( Shardul Thakur), మహ్మద్ సిరాజ్ ( Md. Siraj)

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Corona alert, Corona cases, Cricket, Sports, Washington

ఉత్తమ కథలు