Shocking News : టీమిండియా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. గుండెపోటుతో యంగ్ క్రికెటర్ మృతి..

Avi Barot (PC : Twitter)

Shocking News : CSK విక్టరీతో సంబరాల్లో ఉన్న క్రికెట్ లవర్స్ కు ఓ బ్యాడ్ న్యూస్. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అదరగొడుతున్న యంగ్ క్రికెటర్ గుండెపోటుతో మరణించాడు.

  • Share this:
    ఐపీఎల్ 2021 (IPL 2021 Season) సీజన్ ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) నాలుగో టైటిల్ ను తమ ఖాతాలో వేసుకుంది. దీంతో అంబరాలు సంబర్నానంటాయ్. CSK విక్టరీతో సంబరాల్లో ఉన్న క్రికెట్ లవర్స్ కు ఓ బ్యాడ్ న్యూస్. 29 ఏళ్ల సౌరాష్ట్ర క్రికెటర్ అవీ భరోట్ (Avi Barot), గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అయిన అవీ భరోట్( Avi Barot Is No More), హర్యానాతో పాటు గుజరాత్ వంటి జట్ల తరుపున దేశవాళీ టోర్నీల్లో పాల్గొన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో బెస్ట్ వికెట్ కీపర్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అవీ భరోట్ గుండెపోటుతో చనిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎంతో ఫిట్ గా ఉండే అవీ భరోట్ ఇలా చనిపోవడంతో ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 1547 పరుగులు, లిస్ట్ ఏ క్రికెట్ 1030 పరుగులు, టీ -20ల్లో 717 రన్స్ చేశాడు. అతని మరణ వార్త వినగానే పలువురు మాజీ క్రికెటర్లు షాక్ కు గురయ్యారు. " సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లో ప్రతీ ఒక్కరినీ ఈ వార్త కలిచివేసింది. అవీ భరోట్ లేని లోటు తీర్చలేనిది. సౌరాష్ట్ర క్రికెటర్‌గా ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు.. " అంటూ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్‌సీఏ) అధికారిక ప్రకటన చేసింది.


    సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడైన భరోట్, 21 రంజీ మ్యాచులు, 17 లిస్టు ఏ మ్యాచులు, 11 దేశవాళీ టీ20 గేమ్స్ ఆడాడు...2011లో అండర్‌19 టీమిండియా కెప్టెన్‌గా ఉన్న భరోట్, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో గోవాతో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో 122 పరుగులు చేసి అదరగొట్టాడు.


    అవీ భరోట్ మృతిపై భారత మాజీ క్రికెటర్, కోచ్ వసీం జాఫర్ ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశాడు. " అవీ భరోట్ లేడనే వార్త తెలిసి షాక్ అయ్యాను. 29 ఏళ్లలో గుండెపోటుతో చనిపోవడం ఏంటో అంతుపట్టడం లేదు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా..." అంటూ ట్వీట్ చేశాడు వసీం జాఫర్. అవీ భరోట్ కుటుంబ సభ్యులు ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని పలువురు మాజీ క్రికెటర్లు కోరుతున్నారు.
    Published by:Sridhar Reddy
    First published: