హోమ్ /వార్తలు /క్రీడలు /

Shocking News : భారత కబడ్డీ స్టార్ ప్లేయర్ దారుణ హత్య.. మ్యాచ్ జరుగుతుండగానే..

Shocking News : భారత కబడ్డీ స్టార్ ప్లేయర్ దారుణ హత్య.. మ్యాచ్ జరుగుతుండగానే..

Sandeep Singh Nangal

Sandeep Singh Nangal

Shocking News : పంజాబ్ లోని జలంధర్ లోని మాలియన్ గ్రామంలో దారుణం జరిగింది. దశాబ్ద కాలానికి పైగా కబడ్డీ ప్రపంచాన్ని శాసించిన అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్.. స్టార్ రైడర్ సందీప్ నంగల్ సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు.

పంజాబ్ లోని జలంధర్ లోని మాలియన్ గ్రామంలో దారుణం జరిగింది. దశాబ్ద కాలానికి పైగా కబడ్డీ ప్రపంచాన్ని శాసించిన అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్.. స్టార్ రైడర్ సందీప్ నంగల్ సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు. మాలియన్ గ్రామంలో స్థానిక కబడ్డీ టోర్నీమెంట్‌ జరుగుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు సందీప్‌ను అతి దారుణంగా కాల్చి చంపారు. సందీప్‌ తల, ఛాతీపై దాదాపు 20 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. కాల్పుల విషయాన్ని జలంధర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లఖ్వీందర్ సింగ్ ధృవీకరించారు. కబడ్డీ సమాఖ్యలో గొడవల కారణంగా సందీప్‌ను హత్య జరిగి ఉండవచ్చని డీఎస్పీ లఖ్వీందర్ సింగ్ అనుమానాన్నివ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.

అయితే, సందీప్‌కు భారత్‌లోనే కాకుండా కెనడా, అమెరికా, యూకేలలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. సందీప్‌ ఖాతాలో అనేక విజయాలు ఉన్నాయి. కబడ్డీ ఆటలో అథ్లెటిక్ ప్రతిభ, నైపుణ్యం కారణంగా అతన్ని కొన్నిసార్లు డైమండ్ ప్లేయర్ అని పిలుస్తారు.

సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా ప్రేక్షకుల ముసుగులో ఉన్న సుమారు 15 మంది గూండాలు సందీప్ పై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఇక, పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం రాగానే.. ఈ ఘటన జరగడం పట్ల కొందరు నెటిజన్లు ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు. ఆప్ ప్రభుత్వంలో కచ్చితంగా శాంత్రి భద్రతలకు ముప్పు వాటిల్లుతుందని కామెంట్లు పెడుతున్నారు.

First published:

Tags: Crime news, Gun fire, Kabaddi, Punjab