వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్, ప్రస్తుత కెప్టెన్ కీరన్ పొలార్డ్ (Kieron Pollard) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ కు ముందు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు బుధవారం ట్విటర్ వేదికగా పొలార్డ్ ఓ ప్రకటనను విడుదల చేశాడు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు తెలిపిన అతను కెరీర్ పట్ల గర్వంగా ఉందన్నాడు. అయితే ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇలాంటి సమయంలో షాకింగ్ నిర్ణయం తీసుకోవడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. విధ్వంసకర ఆటతీరుకు పెట్టింది పేరు కీరన్ పొలార్డ్. 10వేలకు పైగా పరుగులు.. 300కు పైగా వికెట్లు తీసి టి20 క్రికెట్ చరిత్రలోనే అత్యున్నత ఆల్ఆరౌండర్గా పేరు పొందాడు. కానీ ఎందుకనో పొలార్డ్‌లో ఆ విధ్వంసం కొన్నాళ్లుగా కనబడడం లేదు. అంతర్జాతీయ మ్యాచ్‌ల నుంచి ప్రైవేట్ లీగ్స్ వరకు పొలార్డ్ ఈ మధ్యన పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. దీంతో, ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
2009 ఛాంపియన్స్ టీ20 లీగ్ ద్వారా క్రికెట్ ప్రపంచానికి పరిచమయ్యాడు. ట్రినిటాడ్ తరఫున సూపర్ ఇన్నింగ్స్ లు ఆడి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కంటిలో పడ్డాడు. ఆ తర్వాత ముంబైకి సంతకం చేసిన పొలార్డ్.. అప్పట్నుంచి ఇప్పటి వరకు ముంబై జట్టులో కీలక ప్లేయర్ గా మారాడు.
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పినా.. ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్స్‌లో పాల్గొనే ఈ కరేబియన్ ప్లేయర్.. వాటి గురించి మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఐపీఎల్ 2022 సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న పొలార్డ్.. అంచనాల మేరకు రాణించలేకపోతున్నాడు. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లోనూ విఫలమవుతున్నాడు. జట్టుకు భారంగా మారుతున్నాడు.
ఇక వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉన్న పొలార్డ్.. ఆ జట్టు తరఫున 123 వన్డేలు, 101 టీ20లు ఆడాడు. వన్డేల్లో 2706 పరుగులతో పాటు 55 వికెట్లు తీసిన పొలార్డ్.. 3 సెంచరీలు 13 హాఫ్ సెంచరీలు బాదాడు. టీ20ల్లో 1569 పరుగులతో పాటు 42 వికెట్లు పడగొట్టాడు. లిమిటెట్ ఫార్మాట్ లో చోటు దక్కించుకున్న పొలార్డ్.. ఒక టెస్టు కూడా ఆడకపోవడం విశేషం. ఇక, పొలార్డ్ ప్రకటనతో క్రికెట్ లవర్స్ షాక్ కు గురువుతున్నారు. మరోవైపు, అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ముంబై ఇండియన్స్ కూడా ఆడతాడో లేదో అన్న అయోమయంలో ఉన్నారు ఆ జట్టు ఫ్యాన్స్.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.