David Warner: తన మనసులో బాధ బయటపెట్టిన వార్నర్.. జట్టును వీడటానికి అసలు కారణం వాళ్లే అని వెల్లడి.. వీలుంటే వస్తానంటూ..

తన మనసులో బాధను వెల్లడించిన డేవిడ్ వార్నర్.. జట్టును వీడటానికి అదే కారణం (PC: SRH)

David Warner: సర్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన విషయంలో అసలు ఏం జరిగిందో చెప్పాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో జరిగిన పరిణామాలన్నింటినీ వెల్లడించి తన మనసులో బాధను వెళ్లగక్కాడు. అయితే వీలుంటే మళ్లీ వస్తానంటూ ఫ్యాన్స్‌కు హింట్ కూడా ఇచ్చాడా?

 • Share this:
  ఐపీఎల్ 2021 (IPL 2021) సందర్భంగా ఎక్కువ సార్లు వార్తల్లో నిలిచిన క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner). ప్రతీ ఏడాది తన సూపర్బ్ ఆటతో పతాక శీర్షికలకు ఎక్కే వార్నర్.. ఈ సారి మాత్రం ఫామ్ లేమితో.. యాజమాన్యంతో విభేదాలతో వార్తల్లో నిలిచాడు. ఒకప్పుడు ఫ్రాంచైజీకి సూపర్ స్ట్రైకర్‌గా పేరు తెచ్చుకున్న వార్నర్.. చివరకు అవమానాల పాలై జట్టును కూడా వదిలేసే పరిస్థితి వచ్చింది. ఐపీఎల్‌లో (IPL) తమ జట్టు ఆడుతున్నన్ని రోజులు అసలు ఏమైందో కూడా బయటకు ఒక్క మాట చెప్పని వార్నర్.. ఎట్టకేలకు తన మనసులోని బాధను వెళ్లగక్కాడు. 'స్పోర్ట్స్ టుడే'తో మాట్లాడిన వార్నర్.. ఈ ఏడాది తన విషయంలో జరిగిన పరిణామాలను చెప్పుకొని బాధపడ్డాడు. నాకు ఎస్‌ఆర్‌హెచ్ (Sunrisers Hyderabad) ఓనర్లు, కోచ్ ట్రెవర్ బేలిస్, లక్ష్మణ్, మూడీ, మురళీధరన్ అంటే చాలా గౌరవం ఉంది. అయితే నా విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నప్పు అది ఏకగ్రీవంగా ఉండాలి. కానీ కెప్టెన్సీ తప్పించాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారో ఇప్పటి వరకు నాకు తెలియదని వార్నర్ అన్నాడు.

  'నన్ను కెప్టెన్‌గా తప్పించినట్లు మీడియాకు సమాచారం ఇచ్చారు. కానీ ఫ్రాంచైజీ యాజమాన్యం కానీ, టీమ్ మేనేజ్‌మెంట్ కానీ నన్ను ఎందుకు తప్పించారో అనే విషయం నాకు చెప్పలేదు. ఒక వేళ నా ఫామ్‌తో సమస్య అయితే అదయినా చెప్పాలి. కెప్టెన్సీ వేరు బ్యాటర్‌గా ఫామ్ వేరు. గత కొన్నేళ్లుగా సన్‌రైజర్స్ జట్టుకు నేనేం చేశాను అందరికీ తెలుసు. కేవలం నాలుగైదు మ్యాచ్‌లలో ఓడిపోతే కెప్టెన్సీని తీసేస్తారా అనే బాధ కలిగింది. అయినా సరే ఇవేవీ ఆలోచించడం లేదు. ఇక మూవాన్ అవడమే' అని వార్నర్ చెప్పుకొచ్చాడు.

  Team India: లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు.. టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం.. బీసీసీఐ నిర్ణయం


  'ఒక జట్టు తరపున దాదాపు 100 మ్యాచ్‌లు ఆడినప్పుడు వాటిలో నాలుగైదు బ్యాడ్ గేమ్స్ కూడా ఉంటాయి. ఈ ఏడాది తొలి దశ చెన్నైలో జరిగినప్పుడు మా జట్టు చాలా ఇబ్బంది పడింది. నేను కూడా ఫామ్‌లో లేను. అది చాలా కఠినమైన దశ. కానీ అలాంటి పరిస్థితిని అందరూ అర్దం చేసుకొని జీర్ణించుకోవాలి. అదొక చేదు గుళికలా భావించాలి. కానీ దాన్నే సాకుగా చూపి నాపై ఇలా అభాండాలు వేయడం.. సమాచారం ఇవ్వకపోవడం చాలా బాధకరం. ఇప్పటికీ నా అనుమానాలకు సమాధానం చెప్పేవాళ్లు లేరు. నేనేం చేయలేను. వారి తీరుతోనే జట్టును వీడాలనే నిర్ణయాన్ని తీసుకున్నా' అంటూ వార్నర్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

  నాకు జట్టంటే చాలా ఇష్టం.. సన్‌రైజర్స్ తరపున ఆడటాన్ని నేను ప్రేమిస్తాను. ఏమో మళ్లీ ఈ జట్టు తరపున ఆడతానేమో.. నాకు తెలియదు. అదంతా జట్టు ఓనర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది అని వార్నర్ చెప్పాడు.
  Published by:John Naveen Kora
  First published: