ఇండియా ఫ్యాన్స్‌ని రెచ్చగొట్టిన పాక్ క్రికెటర్.. మనోళ్లు ఆడేసుకున్నారుగా..

ఆ ట్వీట్‌తో భారత అభిమానుల కోపం కట్టలు తెంచుకుంది. అందుకే అదే ట్విటర్‌ వేదికగా మాలిక్‌ను ఆడేసుకున్నారు. ఫన్నీ మీమ్స్‌ పెట్టి మన హైదరాబాదీ అల్లుడికి చుక్కలు చూపించారు.

news18-telugu
Updated: December 26, 2019, 6:30 PM IST
ఇండియా ఫ్యాన్స్‌ని రెచ్చగొట్టిన పాక్ క్రికెటర్.. మనోళ్లు ఆడేసుకున్నారుగా..
మాలిక్ ట్వీట్ చేసిన ఫొటో
  • Share this:
పాకిస్తాన్ క్రికెటర్లు అంతే..! భారత్‌పై, టీమిండియా క్రికెటర్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. అభిమానులను రెచ్చగొట్టడం వారికి అలవాటే. మనం వాళ్ల గురించి పట్టించుకోకపోయినా.. వారు మాత్రం మనోళ్లను కెలికి మరి తిట్టించుకుంటారు. ఇలా చాలాసార్లే జరిగింది. తాజాగా పాకిస్తాన్ క్రికెటర్, సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ సైతం ఇలాంటి పనే చేశాడు. ఎంఎస్ ధోనీపై వెటకారంగా ట్వీట్ చేసి భారత క్రికెట్ అభిమానులను రెచ్చగొట్టాడు. డిసెంబరు 25న క్రిస్మస్ సందర్భంగా ట్విటర్‌లో ఎంఎస్ ధోనీ ఫోటోతో ఓ ట్వీట్ చేశాడు మాలిక్. మెర్రీ క్రిస్మస్ దోస్తోం...అంటూ సెటైరికల్ ట్వీట్ పెట్టాడు. ధోనీ దిగాలుగా ఉన్నట్లు.. మాలిక్ ఏదో సాధించి ఉద్ధరించినట్లుగా ఆ ఫొటోలో ఉంది. ఆ ట్వీట్‌తో భారత అభిమానుల కోపం కట్టలు తెంచుకుంది. అందుకే అదే ట్విటర్‌ వేదికగా మాలిక్‌ను ఆడేసుకున్నారు. ఫన్నీ మీమ్స్‌ పెట్టి మన హైదరాబాదీ అల్లుడికి చుక్కలు చూపించారు. గతంలో మాలిక్ డకౌట్ అయిన ఫొటోలు, కింద పడిపోయిన ఫొటోలు ట్వీట్ చేస్తూ.. మాలిక్‌ను ఒక రేంజ్‌లో ఆడుకున్నారు. అందులో కొన్ని ట్వీట్లు ఇక్కడ చూడండి.First published: December 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు