కార్గిల్ యుద్ధానికి వెళ్దామనుకున్నా...షోయిబ్ అక్తర్ సొంత డబ్బా

పాకిస్థాన్ మాజీ ఫేసర్ షోయిబ్ అక్తర్ సొంత డబ్బా ఎక్కువయ్యింది. సంచలన వ్యాఖ్యలతో పాక్ మీడియా దృష్టిని ఆకర్షించడం అలవాటుగా పెట్టుకున్న అక్తర్...మరోసారి అదే పనిచేశాడు. కార్గిల్ యుద్ధానికి వెళ్లేందుకు పాకిస్థాన్ ఆర్మీలో చేరాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు.

news18-telugu
Updated: August 2, 2020, 7:38 PM IST
కార్గిల్ యుద్ధానికి వెళ్దామనుకున్నా...షోయిబ్ అక్తర్ సొంత డబ్బా
పాకిస్థాన్ మాజీ ఫేసర్ షోయిబ్ అక్తర్(ఫైల్ ఫోటో)
  • Share this:
పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు ఈ మధ్య అదే పనిగా సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. ఈ విషయంలో షాహిద్ అఫ్రిది, షోయిబ్ అక్తర్ ఇద్దరూ అందరికంటే ముందుంటున్నారు. అదే పనిగా భారత జట్టులోని ప్రస్తుత ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లపై కామెంట్స్ చేస్తూ నోటి తీట వదిలించుకుంటున్నారు. సంచలన వ్యాఖ్యలతో తమ దేశ మీడియాను ఆకర్షిస్తూ..సొంత ఇమేజ్‌ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ రద్దు కావడంతో దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2020ను నిర్వహించాలన్న బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుబెడుతూ షోయిబ్ అక్తర్ తన అక్కసు వెళ్లగక్కాడు. ఓ ఇంటర్వ్యూలో మాజీ ఓపనర్ వీరేంద్ర సెహ్వాగ్‌పై నోరుపారేసుకున్నాడు. క్రీజులో తనను కించపిరేలా సెహ్వాగ్ మాట్లాడుంటే బతుకుతాడా? అతన్ని నేను వదిలేసే వాడినా? అక్కడే మైదానంలో కొట్టేవాడిని, తర్వాత హోటళ్లో కూడా ఘర్షణ పడేవాడినంటూ సెహ్వాగ్‌పై అక్తర్ నోరుపారేసుకున్నాడు.

తాజాగా షోయిబ్ అక్తర్ తమ దేశ పత్రికల్లో పతాక శీర్షికల్లో నిలిచేందుకు మరిన్ని అడ్డగోలు వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో కార్గిల్ యుద్ధం సమయంలో తాను పాకిస్థాన్ ఆర్మీలో చేరాలనుకున్నట్లు వెల్లడించాడు. పాకిస్థాన్ ఆర్మీలో పనిచేయాలన్న ఉద్దేశంతో 1.75 లక్షల పౌండ్ల కాంట్రాక్టులను కూడా వదులుకున్నట్లు చెప్పుకొచ్చాడు. కార్గిల్‌లో యుద్ధానికి వెళ్లేందుకు రావల్పిండి నుంచి లాహోర్‌ శివారుకు చేరుకున్నానని...యుద్ధంలో ప్రాణాలు కోల్పోయేందుకు కూడా సిద్ధమని ఓ ఆర్మీ జనరల్‌తో చెప్పానన్నాడు. ఇలా తాను దేశం కోసం రెండుసార్లు క్రికెట్‌కు దూరమయ్యానని వెల్లడించాడు. తాను పాకిస్థాన్ దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు కూడా సిద్ధమంటూ అక్తర్ వ్యాఖ్యానించాడు.

షోయిబ్ అక్తర్ ఇలా నమ్మశక్యంకాని ప్రకటనలతో వార్తల్లో నిలవడం ఇదే మొదటిసారి కాదు. భారత్-పాకిస్థాన్‌ల మధ్య కార్గిల్ యుద్ధం 1999లో జరగ్గా...ఆ యుద్ధంలో పాకిస్థాన్ ఆర్మీలో చేరేందుకు 2002లో తాను భారీ కాంట్రాక్టులను వదులుకున్నట్లు పేర్కొనడం విశేషం. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా జులై 26న కార్గిల్ అమరవీరులకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సింగ్, శిఖర్ థావన్, ఇషాంత్ శర్మ తదితరులు నివాళులర్పించారు. 1999లో మే 2న మొదలైన కార్గిల్ యుద్ధం..జులై 26 వరకు కొనసాగింది.
Published by: Janardhan V
First published: August 2, 2020, 7:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading