అక్తర్‌కు సొంత డబ్బా మరీ ఎక్కువయ్యిందిగా.. మనోళ్లు బతిమాలారట..

కొన్ని రోజులుగా అక్తర్ ఇస్తున్న బిల్డప్ చూసి.. మనోడు బిల్డప్ బాబాయ్‌ని మించి పోయాడుగా అని టీమిండియా ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారు.

news18-telugu
Updated: August 15, 2020, 6:51 PM IST
అక్తర్‌కు సొంత డబ్బా మరీ ఎక్కువయ్యిందిగా.. మనోళ్లు బతిమాలారట..
షోయబ్ అక్తర్
  • Share this:
పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌కు సొంత డబ్బా మరీ ఎక్కువయింది. తన గురించి ఎక్కువగా చెప్పుకునే క్రమంలో పక్కవాళ్లను చిన్నది చేసి చూపిస్తున్నాడు. సొంత మీడియా నోళ్లలో నిత్యం నానేందుకు భారత ఆటగాళ్ల గురించి మాట్లాడటమే పనిగా పెట్టుకున్నాడు. తాజాగా మరోసారి భారత ఆటగాళ్లపై నోరుపారేసుకున్నాడు షోయబ్ అక్తర్. బౌన్సర్లు విసిరి తమను గాయపరచవద్దని, కావాలంటే ఔట్ చేసుకోమని భారత క్రికెటర్ల తనో అనేవారని బిల్డప్ ఇచ్చాడు. తమకు భార్యా పిల్లలున్నారు.. దయచేసి వదిలేయమని మనోళ్లు బతిమిలాడినట్లుగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు అక్తర్. క్రిక్‌కాస్ట్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌లో క్రికెట్‌ వ్యాఖ్యాత సవేరా పాషాకు షోయబ్ అక్తర్ ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన బౌలింగ్‌ గురించి గొప్పలకు పోయాడు. ఈ ప్రపంచంలో తనంత వేగంగా ఇంకెవరూ బంతులు విసరలేరన్నట్లుగా కలరింగ్ ఇచ్చాడు. ఇంగ్లాండ్‌లో ఓసారి కౌంటీ క్రికెట్‌ ఆడుతుండగా.. వద్దని చెప్పినా ఓ బ్యాట్స్‌మెన్ తనతో బౌలింగ్‌ వేయించుకొని గాయపడ్డాడని తెలిపాడు అక్తర్. అతడు వికెట్ల మీద కుప్పకూలడంతో, చనిపోయాడేమోని అనుకున్నట్లు చెప్పాడు. ఇలాంటి ఘటనలు చాలాసార్లు జరిగాయన్నాడు పాక్ మాజీ పేసర్.

ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా టెయిలెండర్లపై కామెంట్‌ చేశాడు షోయబ్ అక్తర్. ‘కావాలంటే మమ్మల్ని ఔట్‌ చేసుకో. అంతేగానీ బౌన్సర్‌ను విసరకు. నీ బంతులు చాలా గట్టిగా తగులుతాయి. మాకు భార్యా పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు చూస్తే బాధపడతారు.' అని తనతో చెప్పేవారని అక్తర్ తెలిపారు. మొన్న ఆ మధ్య కార్గిల్ యుద్ధంలో పాల్గొనేందుకు పాక్ ఆర్మీలో చేరాలని ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చాడు. కొన్ని రోజులుగా అక్తర్ ఇస్తున్న బిల్డప్ చూసి.. మనోడు బిల్డప్ బాబాయ్‌ని మించి పోయాడుగా అని టీమిండియా ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారు. 'నీ ఓవరాక్షన్ ఇక చాలు.. ఆపు' అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: August 15, 2020, 6:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading