Shoiab Akthar : కోహ్లీ విషయంలో అనుష్క శర్మకు వార్నింగ్ ఇచ్చిన షోయబ్ అక్తర్..

విరుష్క - షోయబ్ అక్తర్

Shoiab Akthar : పాకిస్థాన్ మాజీ పేసర్..రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ (Shoiab Akthar) తన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ముఖ్యంగా టీమిండియా ఆటగాళ్లను ఎప్పుడు తలుచుకుంటూ హాట్ టాపిక్ గా మారుతుంటాడు. లేటెస్ట్ గా ఈ మాజీ పేసర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయ్.

  • Share this:
    పాకిస్థాన్ మాజీ పేసర్..రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ (Shoiab Akthar) తన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ముఖ్యంగా టీమిండియా ఆటగాళ్లను ఎప్పుడు తలుచుకుంటూ హాట్ టాపిక్ గా మారుతుంటాడు. లేటెస్ట్ గా ఈ మాజీ పేసర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయ్. ఈ మాజీ పాకిస్థాన్ ఆటగాడు.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మకు వార్నింగ్ ఇచ్చాడట. ఈ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడు. టీమిండియా మాజీ ఎంఎస్ ధోనీ తర్వాత టీమిండియాకు కెప్టెన్​గా కోహ్లీని ఎంపికచేసినప్పుడు తాను భయపడ్డానని పాకిస్థాన్​ మాజీ బౌలర్​​ వెల్లడించాడు. బ్యాట్స్​మన్​గా అద్భుతంగా రాణిస్తున్న కోహ్లీ.. సారథిగా విఫలమైతే అభిమానులు విమర్శించే అవకాశం ఉందని అబిప్రాయపడ్డాడట. ఇదే విషయాన్ని అనుష్కకు చెప్పి.. పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడట. ఓ క్రీడా ఛానెన్‌లో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. 2014లో విరాట్ కోహ్లీ భారత టెస్ట్ జట్టు పగ్గాలు అందుకున్న రోజులను గుర్తుచేసుకున్నాడు. 2014లో ఎంఎస్ ధోనీ టెస్టులకు వీడ్కోలు పలకడంతో.. టీమిండియా సారథిగా కోహ్లీ నియమితుడయ్యాడు. అప్పటికి కోహ్లీ వయసు దాదాపుగా 25 ఏళ్లు. "బ్యాట్స్​మన్​గా అద్భుతంగా రాణిస్తున్న తొలి నాళ్లలోనే విరాట్ కోహ్లీపై కెప్టెన్సీ భారం మోపారు. కోహ్లీ కెప్టెన్సీ చేపట్టి తప్పు చేశాడని ఓ షోలో అతడి భార్య అనుష్క శర్మకు కూడా చెప్పా. సారథ్య బాధ్యతల వల్ల అతడిపై ఒత్తిడి అధికంగా ఉంటుందని వివరించా. ఓ చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాననుకోండి" అని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ తెలిపాడు. అనుష్క, కోహ్లీ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

    " క్రికెట్​ను మతంలా భావించే దేశంలో కెప్టెన్‌గా విఫలమైతే అతడిపై విమర్శలు వచ్చే ప్రమాదం ఉందనుకున్నా. అయినప్పటికీ ఇవన్నీ చాలా చాకచాక్యంతో అధిగమించాడు. కోహ్లీ ఫీల్డ్​లోకెప్టెన్​గా కాకుండా ఓ బౌలర్​లా కనిపిస్తాడు. విరాట్ కెప్టెన్సీలో భారత పేస్​ ఎటాక్​ దృఢంగా మారింది " అని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.

    అక్తర్‌ పాకిస్తాన్ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టీ20ల్లో 19 వికెట్స్ పడగొట్టాడు. పాక్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 224 మ్యాచ్‌లు ఆడిన అక్తర్.. 444 వికెట్లు పడగొట్టాడు. ఇక, వచ్చే టీ-20 వరల్డ్ కప్ లో టీమిండియా, పాకిస్థాన్ జట్లే ఫైనల్ కు చేరుకుంటాయని జోస్యం చెప్పాడు. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉన్న విషయం తెలిసిందే.
    Published by:Sridhar Reddy
    First published: