సౌరభ్‌ గంగూలీపై అక్తర్‌ పొగడ్తలు.. ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్

టీమ్‌ఇండియా మాజీ సారథి సౌరభ్‌ గంగూలీపై పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఎప్పుడు విమర్శలతో వార్తల్లో నిలిచే షోయబ్‌ అక్తర్‌ ఈసారి గంగూలీపై పాజిటీవ్‌గా స్పందించాడు.

Rekulapally Saichand
Updated: August 11, 2020, 7:16 PM IST
సౌరభ్‌ గంగూలీపై అక్తర్‌ పొగడ్తలు.. ఆశ్చర్యపోతున్న  ఫ్యాన్స్
షోయబ్ అక్తర్(ఫైల్ ఫోటో)
  • Share this:
టీమ్‌ఇండియా మాజీ సారథి సౌరభ్‌ గంగూలీపై పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఎప్పుడు విమర్శలతో వార్తల్లో నిలిచే షోయబ్‌ అక్తర్‌ ఈసారి గంగూలీపై పాజిటీవ్‌గా స్పందించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్టులో దాదాను పొగడ్తలతో ముంచెత్తాడు. భారత్‌-పాక్‌ జట్ల మధ్య జరుగుతున్న ఓ మ్యాచ్‌లో తను,గంగూలీ మాట్లాడుకుంటున్న ఒక ఫొటోను అందులో షేర్ చేశాడు

సహజంగా ఆటగాళ్లపై నోరు పారేసుకునే రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ ఓ ఆటగాడ్ని పొగడడం అందిర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అది భారత క్రికెట్ మాజీ సారథి గంగూలీని ప్రశంసించడం మరింత ఆశ్చర్యపరిచే విషయం. ఇంతకి అతను ఏమన్నాడో చూద్దాం. జట్టు మీదైనా పోటీపడేందుకు నేను సిద్దంగా ఉండేవాన్ని. ప్రత్యర్థులను కట్టడి చేయడమంటే నాకు ఇష్టం. నా కేరీర్‌లో సౌరభ్‌ గంగూలీని ఎదుర్కొవడం చాలా కఠినతరంగా అనిపించింది. అలాగే గంగూలీ గొప్ప నాయకుడు. అతను ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌‌కు కెప్టెన్‌‌గా ఉన్నప్పుడు నేను ఆడాను అంటూ అక్తర్‌ గుర్తుచేసుకున్నాడు.
Published by: Rekulapally Saichand
First published: August 11, 2020, 7:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading