న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ అతడికి చివరిది.. మాజీ కెప్టెన్‌పై షోయబ్ అక్తర్..

కరోనా మహమ్మారి లేకుంటే.. 2020 ఐపీఎల్‌లో ఉత్తమ ప్రదర్శన కనబర్చి టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించేవాడు. కానీ ఆ అవకాశం ధోనికి లేకుండాపోయింది.

news18-telugu
Updated: April 12, 2020, 7:29 PM IST
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ అతడికి చివరిది.. మాజీ కెప్టెన్‌పై షోయబ్ అక్తర్..
ఎంఎస్ ధోనీ
  • Share this:
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చివరి మ్యాచ్ 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో ఆడేశాడని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అన్నారు. ధోని రిటైర్మెంట్‌పై అక్తర్ స్పందిస్తూ.. మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌ను ఎక్కువ కాలం పొడగించకుండా ఉంటే బాగుందని అభిప్రాయపడ్డాడు. ఇండియాకు ధోని రెండు ప్రపంచ కప్‌లు అందించడంలో ముఖ్యపాత్ర పోషించాడని, అందుకు ఇండియా ధోనికి చాలా గౌరవంతో వీడ్కోలు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాడు. నిజానికి ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు పలకాల్సిన అవసరం వచ్చింది.

ఇప్పటికైనా ఆటకు వీడ్కొలు పలికాలి, ఇంతకాలం ఎందుకు సాగదీస్తున్నాడో అర్థం కావట్లేదని తెలిపారు. కరోనా మహమ్మారి లేకుంటే.. 2020 ఐపీఎల్‌లో ఉత్తమ ప్రదర్శన కనబర్చి టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించేవాడు. కానీ ఆ అవకాశం ధోనికి లేకుండాపోయింది. అయితే ధోనీ 2019 ప్రపంచకప్ తర్వాతైనా చివరి సిరీస్ ఆడి గౌరవంగా తప్పుకుంటే బాగుండేదని షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు.
First published: April 12, 2020, 7:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading