• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • SHOAIB AKHTAR FIRES PAKISTHAN CRICKET BOARD OVER THE POSTPONEMENT OF THE PSL DUE TO COVID 19 OUTBREAK AND REQUESTS PM IMRAN KHAN TO INTERVENE SRD

PSL 2021 : ఆటగాళ్ల ప్రాణాలంటే లెక్కలేదా.. పాకిస్థాన్ పరువు పోయింది..షోయబ్ అక్తర్ ఫైర్..

PSL 2021 : ఆటగాళ్ల ప్రాణాలంటే లెక్కలేదా.. పాకిస్థాన్ పరువు పోయింది..షోయబ్ అక్తర్ ఫైర్..

Shoiab Akthar (ఫైల్ ఫోటో)

PSL 2021 : పాకిస్థాన్‌లో ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్‌ని వాయిదా వేస్తున్నట్టు పీసీబీ ప్రకటించింది. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో పాల్గొంటున్న వారిలో మరో ముగ్గురు క్రికెటర్స్‌కి COVID-19 పాజిటివ్ రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ స్పష్టంచేసింది. దీంతో మొత్తం ఏడుగురు ప్లేయర్లు కరోనా బారిన పడ్డారు.

  • Share this:
    పాకిస్థాన్‌లో ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్‌ని వాయిదా వేస్తున్నట్టు పీసీబీ ప్రకటించింది. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో పాల్గొంటున్న వారిలో మరో ముగ్గురు క్రికెటర్స్‌కి COVID-19 పాజిటివ్ రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ స్పష్టంచేసింది. దీంతో మొత్తం ఏడుగురు ప్లేయర్లు కరోనా బారిన పడ్డారు. ఫిబ్రవరి 20న ప్రారంభమైన పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో మొత్తం 34 మ్యాచులు ఆడాల్సి ఉండగా 14 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. దీంతో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారని అక్తర్ అన్నాడు. బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు. షోయబ్‌ అక్తర్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ పాకిస్తాన్ క్రికెట్‌ బోర్డుపై ఫైర్ అయ్యాడు. "పీఎస్‌ఎల్‌లో సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. బయోసెక్యూర్‌ పరిస్థితుల్ని పకడ్బందీగా అమలు చేయాల్సింది. కానీ అలా జరగలేదు. మెడికల్‌ సిబ్బందిని శిక్షించాలని ఉన్నతాధికారులను కోరుతున్నా. ఎందుకంటే వారు ఆటగాళ్ల జీవితాలతో ఆడుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులుగా పీసీబీ సీఈవో వసీమ్‌ ఖాన్‌ పేరును ప్రస్తావిస్తున్నారు. ఆయనను ఎవరు తీసుకొచ్చారు? పీసీబీ ఛైర్మన్‌ ఎహ్‌సాన్‌ మని తెచ్చారు. ఇప్పుడు మని ఎక్కడున్నారు? దీనికి ఆయన సమాధానం ఇవ్వాలి" అని అన్నాడు.

    "పీఎస్‌ఎల్ వాయిదా విషయంలో పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ‌ఖాన్‌ జోక్యం చేసుకోవాలి. ఎక్కడ తప్పు జరిగిందో ఆయన ప్రశ్నించాలి. పీసీబీ పెద్దలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆటగాళ్ల కోసం బుక్‌ చేసిన హోటల్‌లో వివాహాలు, ఇతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆటగాళ్లు కూడా నిబంధనల్ని అతిక్రమించి తిరుగుతున్నారు. అధికారులు ఏం చేస్తున్నారు?" అని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్‌ అక్తర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

    ఇలా జరగడం వల్ల ఆటగాళ్ల జీవితాలను ప్రమాదంలోకి నెట్టడమే కాకుండా పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు పరువు కూడా పోయిందని మాజీ పేసర్‌ అక్తర్‌ చెప్పుకొచ్చాడు. ఇందుకు పీసీబీ ఛైర్మన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో పీఎస్‌ఎల్‌ను నిర్వహించి ఎహ్‌‌సాన్‌ పాకిస్థాన్‌ దేశ పరువుతో పాటు ఆ క్రికెట్‌ బోర్డు పరువు కూడా తీశాడని షోయబ్‌ అక్తర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు పీఎస్ఎల్ దెబ్బతో బీసీసీఐ అలర్ట్ అవాల్సిన అవసరం ఉంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఐపీఎల్ పైన కూడా కరోనా వేటు వేసే అవకాశం ఉంది.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు