Home /News /sports /

SHIRTLESS ROHAN MUSTAFA FAILS TO STOP A BOUNDARY IN ONGOING ABU DHABI T10 LEAGUE SSR

ద్యావుడా.. ఇదేందిది.. ఇదేందయ్యా ఇది.. క్రికెట్‌లో ఇలాంటి ఫీల్డింగ్‌ ఎప్పుడూ చూడలా..!

రోహన్ ముస్తఫా ఫీల్డింగ్ చేస్తున్న దృశ్యం

రోహన్ ముస్తఫా ఫీల్డింగ్ చేస్తున్న దృశ్యం

క్రికెట్‌ అంటేనే ఒక భావోద్వేగ సమ్మితమైన క్రీడ. క్రికెట్‌లో తాము అభిమానించే టీం ఓడిపోతే ఫ్యాన్స్ విలవిలలాడిపోతారు. కొందరు ఫ్యాన్స్ అయితే ఏకంగా స్టేడియంలోనే కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలను మనం చాలా సందర్భాల్లో చూశాం. క్రికెట్‌ను అభిమానించే ఫ్యాన్స్ అంత సీరియస్‌గా ఆ క్రీడను..

ఇంకా చదవండి ...
    క్రికెట్‌ అంటేనే ఒక భావోద్వేగ సమ్మిళతమైన క్రీడ. క్రికెట్‌లో తాము అభిమానించే టీం ఓడిపోతే ఫ్యాన్స్ విలవిలలాడిపోతారు. కొందరు ఫ్యాన్స్ అయితే ఏకంగా స్టేడియంలోనే కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలను మనం చాలా సందర్భాల్లో చూశాం. క్రికెట్‌ను అభిమానించే ఫ్యాన్స్ అంత సీరియస్‌గా ఆ క్రీడను వీక్షిస్తున్న ఈ కాలంలో ఒక క్రికెటరే ఆ క్రీడను లైట్ తీసుకుంటే ఎలా ఉంటుంది. చూసే ఫ్యాన్స్‌కు ఒళ్లు మండుతుంది. సరిగ్గా అలాంటి ఓ విచిత్ర ఘటనే అబుదాబిలో జరిగింది. అబుదాబి టీ10 లీగ్ చాలా సీరియస్‌గా జరుగుతున్న వేళ అబుదాబి ఫీల్డర్ రోహన్ ముస్తఫా తన చెత్త ప్రవర్తనతో గేమ్ సీరియస్‌నెస్‌ను పోగొట్టాడు. క్రికెట్‌నే అపహాస్యం చేసేలా వ్యవహరించాడు.

    వివరాల్లోకెళితే.. అబుదాబి టీం, నార్త్రన్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో.. రోహన్ ముస్తఫా ఫీల్డింగ్ సమయంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్ కొట్టిన షాట్ ముస్తఫా వైపు ఉన్న బౌండరీ లైన్ వైపు వచ్చింది. ఆ సమయంలో విప్పేసిన షర్ట్ వేసుకుంటూ ముస్తఫా బంతి వెంట పరుగులు తీశాడు. ఆ బంతి బౌండరీ లైన్‌ను తాకి ఫోర్ వెళ్లింది. ఫోర్‌ వెళ్లకుండా ఆపకపోగా, ముస్తఫా వ్యవహరించిన తిక్క వైఖరికి ప్రత్యర్థి జట్టు ఆటగాడు నికోలస్ పూరన్ నవ్వాపుకోలేకపోయాడు. సొంత టీం సభ్యులు కూడా నవ్వారు.





    ముస్తఫా షర్ట్‌లెస్ ఫీల్డింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ ద్యావుడా.. ఇదేం ఫీల్డింగ్’ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో వారియర్స్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇలాంటి నిర్లక్ష్య ఫీల్డింగ్‌తో అబుదాబి టీం మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగిన షేక్ జాయెద్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికైంది. ముస్తఫా తీరుపై ఓ అభిమాని ‘లీగ్ మీద కాస్త సీరియస్‌గా దృష్టి పెట్టు’ అని ట్వీట్ చేయగా, మరొక నెటిజన్ స్పందిస్తూ.. ‘ ఇలాంటి చేష్టలు జరిగితే క్రికెట్ అసలు జెంటిల్‌మెన్స్ గేమే కాదు’ అని ట్వీట్ చేశాడు. యూఏఈ క్రికెట్ బోర్డ్ కూడా ముస్తఫా వైఖరి పట్ల సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Cricket, Funny video, Sports, UAE, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు