హోమ్ /వార్తలు /క్రీడలు /

Shikhar Dhawan : బీసీసీఐ కీలక నిర్ణయం..టీమిండియా కెప్టెన్ గా శిఖర్ ధావన్!

Shikhar Dhawan : బీసీసీఐ కీలక నిర్ణయం..టీమిండియా కెప్టెన్ గా శిఖర్ ధావన్!

ఫైల్ ఫొటో

ఫైల్ ఫొటో

 Shikhar Dhawan : అక్టోబ‌ర్ 16 న టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్(T20 Worldcup) ఆస్ట్రేలియాలో ప్రారంభంకానున్న విష‌యం తెలిసిందే. అయితే టీ20 వరల్డ్ కప్ కి ముందు భారత జట్టు(Team India) దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో మ్యాచులు ఆడనుంది. ఇవి మెగా టోర్నీకి మంచి సన్నద్ధతగా మారనున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Shikhar Dhawan : అక్టోబ‌ర్ 16 న టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్(T20 Worldcup) ఆస్ట్రేలియాలో ప్రారంభంకానున్న విష‌యం తెలిసిందే. అయితే టీ20 వరల్డ్ కప్ కి ముందు భారత జట్టు(Team India) దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో మ్యాచులు ఆడనుంది. ఇవి మెగా టోర్నీకి మంచి సన్నద్ధతగా మారనున్నాయి. ముందుగా దక్షిణాఫ్రికాతో(South Africa) మూడు వన్డేలు, టీ20ల సిరీస్‌ జరగనుంది. సెప్టెంబ‌ర్ 28వ తేదీ నుంచి సౌతాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వ‌న్డేల‌ను(ODIs) ఇండియా ఆడ‌నుంది. తిరువ‌నంత‌పురంలో సెప్టెంబ‌ర్ 28వ తేదీన తొలి టీ20 జ‌ర‌గ‌నున్న‌ది. రెండ‌వ టీ20 అక్టోబ‌ర్ 2న‌, 4న ఇండోర్‌లో మూడ‌వ టీ20 జ‌రుగుతుంది. ఇక వ‌న్డే సిరీస్‌ అక్టోబ‌ర్ 6 నుంచి ప్రారంభంకానున్న‌ది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే అక్టోబర్ 6న జరగనుండగా.. రెండో వన్డే అక్టోబర్ 9న, మూడో వన్డే అక్టోబర్ 11న జరగనుంది.

అయితే ఓపెనింగ్ బ్యాట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్‌(Shikhar Dhawan).. స్వ‌దేశంలో సౌతాఫ్రికాతో జ‌రిగే వ‌న్డే సిరీస్‌కు సార‌థ్య బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాల్గొనే ప్లేయ‌ర్ల‌కు రెస్ట్ ఇస్తున్న నేప‌థ్యంలో కెప్టెన్సీని ధావ‌న్‌కు అప్ప‌గించిన‌ట్లు బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలు వన్డే సిరీస్ ఆడరని సమాచారం. కాగా, ఇంతకుముందు కూడా ధావన్ చాలా సందర్భాలలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

Divorce Invitation : మగాళ్లకు మాత్రమే..పెళ్లిని మించి గ్రాండ్ గా విడాకుల పార్టీ

మరోవైపు,ఆదివారం ముగిసిన ఆసియా కప్ 2022లో భారత జట్టు నిరాశాజనక ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. సూపర్ 4 దశలో వరుసగా రెండు మ్యాచులు ఓడిన టీమిండియా ఫైనల్ చేరకుండగానే ఇంటిదారి పట్టింది. అయితే ఆస్ట్రేలియాలో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 టోర్న‌మెంట్‌లో భారత జట్టును తక్కువ అంచనా వేయలేం. స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ జట్టులోకి రానుండడంతో భారత్ బౌలింగ్ పటిష్టంగా మారనుంది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: India vs South Africa, Team India

ఉత్తమ కథలు