• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • SHIKHAR DHAWAN PERFORMS PUJA AT KALA BHIRAV TEMPLE VARANASI VIDEO GOES VIRAL SK

Shikhar Dhawan: రాత్రివేళ కాలభైరవ ఆలయంలో ధావన్ పూజలు.. వీడియో వైరల్

Shikhar Dhawan: రాత్రివేళ కాలభైరవ ఆలయంలో ధావన్ పూజలు.. వీడియో వైరల్

శిఖర్ ధావన్

Shikhar Dhawan: నుదుట మూడు నామాలు ధరించి.. శివుడి పాటను ఆలపిస్తూ వారణాసిలో సందడి చేశాడు గబ్బర్. ఈ వీడియోను ఇన్‌స్ట్రగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

  • Share this:
    గ్రౌండ్‌లో పరుగుల వరద పారించే టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్... బయట కూడా అంతే యాక్టివ్‌గా ఉంటాడు. తోటి ఆటగాళ్లతో సరదాగా డాన్స్‌లు చేస్తూ.. కామెడీ చేస్తూ.. సందడి చేస్తుంటాడు. ఐతే మంగళవారం వారణాసిలో ప్రత్యక్షమైన గబ్బర్.. రాత్రి వేళ కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. చలిగా ఉండడంతో కంబళి కప్పుకొని .. దాన్నే మాస్క్‌లా ముఖాన్ని కవర్ చేసి.. ఆలయం వద్దకు వెళ్లాడు. ముఖం సరిగ్గా కనిపించకపోవడంతో ఎవరూ పెద్దగా గుర్తు పట్టలేదు. పూజ పూర్తయిన తర్వాత ముఖానికి మాస్క్ తీసేయడంతో అందరూ గుర్తుపెట్టారు. శిఖర్ ధావన్ వచ్చాడని ఆతడి వద్దకు పరుగులు తీసి.. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఆలయ పూజారి కూడా ఆయనతో ఫొటో తీసుకున్నారు. ఎవరినీ నిరుత్సాహ పరచకుండా శిఖర్ ధావన్ కూడా ఫొటోలు దిగారు.

    మంగళవారం గబ్బా టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించి.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. భారత చారిత్రాత్మక విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు శిఖర్ ధావన్. ఆ గెలుపుపై ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే కాల భైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాడు. టీమిండియా మరిన్ని విజయాలు సాధించాలని దేవుడిని ప్రార్థించాడు. ఈ సందర్భంగా నుదుట మూడు నామాలు ధరించి.. శివుడి పాటను ఆలపిస్తూ సందడి చేశాడు గబ్బర్. ఈ వీడియోను ఇన్‌స్ట్రగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.



    గబ్బా టెస్ట్‌లో మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 369 పరుగులు చేసింది. ఇక టీమిండియా 336 పరుగులు చేసి.. కాస్త వెనకబడింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. 294 పరుగులకే ఆసీస్‌ను కట్టడి చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగిన భారత కుర్రాళ్లు అదరగొట్టాడు. 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచారు. ఈ టెస్ట్ మ్యాచ్‌ విజయంలో శుభమాన్ గిల్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించారు. సిరీస్ గెలిచిన సందర్భంగా భారత జట్టుకు రూ.5 కోట్ల బోనస్ ప్రకటించింది బీసీసీఐ.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు