Coronavirus: బ్యాట్ పట్టాల్సిన చేతులతో బట్టలు ఉతికిన స్టార్ క్రికెటర్

శిఖర్ ధవన్ (ఫైల్)

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా క్రీడలు రద్దు కావడంతో ఇండియన్ క్రికెటర్లకు కుటుంబాలతో గడిపేందుకు సమయం దొరికింది. దీంతో ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్ బట్టలు ఉతుకుతున్న వీడియోను ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు.

  • Share this:
    బ్యాట్ పట్టాల్సిన చేతులతో బట్టలు ఉతికాడో స్టార్ క్రికెటర్. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దాదాపు అన్ని క్రీడలను నిలిపేశారు. దీంతో చాలామంది క్రికెటర్లు తమ కుటుంబాలకు సమయాన్ని వెచ్చించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు సామాజిక దూరం పాటిస్తూ ఇళ్లలోంచి బయటకు రావట్లేదు. ఈ క్రమంలోనే శిఖర్ ధావన్ ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో శిఖర్ ధావన్ బట్టలు ఉతకడంతో పాటు బాత్రూమ్‌ను శుభ్రం చేస్తున్నక్లిప్స్‌ను చూడొచ్చు. సరదాగా ఈ వీడియోను షేర్ చేయగా, అతని భార్య మిర్రర్ ఎదుట అలంకరించుకోవడం ఈ వీడియోలో కన్పిస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్‌లో అతడి భాగస్వామైన, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ వీడియోను షేర్ చేయడం గమనార్హం.

    Published by:Anil
    First published: