HOME »NEWS »SPORTS »shikhar dhawan feeding birds amid bird flu varanasi dm vows to take action against boatman su

Shikhar Dhawan: వివాదస్పదంగా మారిన శిఖర్ దావన్ వారణాసి టూర్.. బోట్ యజమానిపై చర్యలకు డీఎం ఆదేశం

Shikhar Dhawan: వివాదస్పదంగా మారిన శిఖర్ దావన్ వారణాసి టూర్.. బోట్ యజమానిపై చర్యలకు డీఎం ఆదేశం
పక్షులకు గింజలు వేస్తున్న ధావన్(Image-Instagram)

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వివాదానికి కేంద్రబిందువుగా మారారు. ఇటీవల వారణాసిలో పర్యటించిన ధావన్ అక్కడ గంగా నదిలో బోట్‌లో విహరించాడు.

  • Share this:
    టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వివాదానికి కేంద్రబిందువుగా మారారు. ఇటీవల వారణాసిలో పర్యటించిన ధావన్ అక్కడ గంగా నదిలో బోట్‌లో విహరించాడు. ఈ సందర్భంగా పక్షులకు ఆహారం అందజేశాడు. తన చేతుల్లోని గింజలను వాటికి ఆహారంగా వేశాడు. ఇందుకు సబంధించిన ఫొటోలను కూడా ధావన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పక్షులకు ఆహారం వేయడం ఆనందంగా ఉందని.. తన వారణాసి పర్యటనకు సంబంధించి విశేషాలను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అయితే ధావన్ పోస్ట్ కాస్త చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం బర్డ్‌ ఫ్లూ నేపథ్యంలో ధావన్ ఇలా చేయడంపై పలువురు నెటిజన్లు మండిపడ్డారు. దీనిపై వారణాసి జిల్లా మేజిస్ట్రేట్(డీఎం) కౌశల్ రాజ్ శర్మ కూడా స్పందించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు నగరంలోని బోట్ మేన్స్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పర్యాటకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు.

    ఇక, ఆదివారం కౌశల్ రాజ్ శర్మ ANI వార్తా సంస్థతో మాట్లాడుతూ.. "నగరంలోని బోట్స్ యాజమానులు అధికారుల సూచనలు పాటించకపోవడంపై మా వద్ద కొద్దిగా సమాచారం ఉంది. వారి పడవల్లో ప్రయాణిస్తున్న టూరిస్టులు పక్షులకు ఆహారం అందిస్తున్నారు. టూరిస్ట్‌లకు ఇలాంటి విషయాలు తెలియవు కాబట్టి బోట్ నడిపేవారు వారు అలా చేయకుండా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇప్పటికే పడవల్లో ప్రయాణించే ప్రయాణికులు పక్షులకు ఆహారం ఇవ్వడానికి అనుమతించకూడదని పోలీసులు, పరిపాలన అధికారులు బోట్స్ యజమానులకు స్పష్టం చేశారు" అని వెల్లడించారు.







    పోలీసులు, అధికారులు జారీచేసిన నిబంధనలు ఎవరు ఉల్లంఘించిన వారికి నోటీసులు జారీ చేయబడతాయని కౌశల్ రాజ్ శర్మ తెలిపారు. అటువంటి వారి లైసెన్స్ ఎందుకు రద్దుచేయకూడదో సమాధానం చెప్పాల్సిందిగా ప్రశ్నించారు. ఈ విషయంలో పర్యాటకులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published:January 24, 2021, 22:10 IST

    टॉप स्टोरीज