హోమ్ /వార్తలు /క్రీడలు /

Shikar Dhawan : కుక్కలతో కలిసి టీమిండియా ఓపెనర్ క్రేజీ స్టెప్పులు...వీడియో వైరల్

Shikar Dhawan : కుక్కలతో కలిసి టీమిండియా ఓపెనర్ క్రేజీ స్టెప్పులు...వీడియో వైరల్

Shikar dhawan (Photo Credit : Instagram)

Shikar dhawan (Photo Credit : Instagram)

Shikar Dhawan : టీమిండియా ఓపెనరల్ శిఖర్ ధావన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డ్రెస్సింగ్ రూమ్ లోనైనా, మైదానంలోనైనా మనోడు ఫుల్ జోష్ లో ఉంటాడు. అలాగే, సోషల్ మీడియాలో కూడా క్రేజీ క్రేజీ వీడియోలు షేర్ చేసి... ఫ్యాన్స్ కు కిక్ ఇస్తాడు.

ఇంకా చదవండి ...

  టీమిండియా ఓపెనరల్ శిఖర్ ధావన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డ్రెస్సింగ్ రూమ్ లోనైనా, మైదానంలోనైనా మనోడు ఫుల్ జోష్ లో ఉంటాడు. అలాగే, సోషల్ మీడియాలో కూడా క్రేజీ క్రేజీ వీడియోలు షేర్ చేసి... ఫ్యాన్స్ కు కిక్ ఇస్తాడు. లేటెస్ట్ గా గబ్బర్ కుక్కలతో కలిసి స్టెప్పులు ఇరగదీశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.శిఖర్ ధావన్ క్రేజీ యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మీసం మెలి వేస్తూ సెలబ్రేట్ చేసుకునే గబ్బర్, క్యాచ్ పట్టిన తర్వాత తొడ కొడుతూ ప్రేక్షకులకు అభివాదం చేస్తాడు. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉండే గబ్బర్ ఓ క్రేజీ డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తన రెండు పెంపుడు కుక్కలతో కలిసి క్రేజీ స్టెప్పులతో ఇరగదీశాడు శిఖర్ ధావన్. అయితే ఈ వీడియోలో ‘గబ్బర్’ డ్యాన్స్ కంటే ఎక్కువగా పాటలోని లిరిక్స్, బ్యాక్ గ్రౌండ్‌లో ఉన్న ట్రోఫీ వాల్ ప్రేక్షకుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించాయి.


  ‘సాడా కుత్తా కుత్తా... టామీ...’ అంటూ సాగే పాటకు గబ్బర్ వేసిన స్టెప్పులకు కెఎల్ రాహుల్ పడిపడి నవ్వుతున్నట్టు ‘హాహాహాహా....’ అంటూ కామెంట్ చేశాడు. అశ్విన్ భార్య ప్రతీ కూడా ఫన్నీగా ఉందన్నట్టు ఎమోజీ ట్వీట్ చేసింది.అయితే చాలామంది నెటిజన్లు ధావన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ట్రోఫీల్లో మహేంద్ర సింగ్ ధోనీ గ్లవ్స్ అందరి దృష్టినీ ఆకర్షించాయి. అనేక టోర్నీల్లో వచ్చిన ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ వంటి టోర్నీలన్నింటినీ తన వాల్‌కి అందంగా అలరించుకున్నాడు శిఖర్ ధావన్. వీటి మధ్యలో ధోనీ గ్లవ్స్, రకరకాల బ్యాట్స్, వికెట్లు, హెల్మెట్ ఉన్నాయి.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Instagram, KL Rahul, Shikhar Dhawan, Team india

  ఉత్తమ కథలు