Home /News /sports /

SHIKHAR DHAWAN BOOKED FOR FEEDING MIGRANT BIRDS IN LUCKNOW AT RIVER GANGA BA

Shikhar Dhawan: క్రికెటర్ శిఖర్ ధావన్ పై పోలీసులకు ఫిర్యాదు.. ఇదే అతను చేసిన ‘నేరం’

శిఖర్ ధావన్ (File)

శిఖర్ ధావన్ (File)

టీమిండియా ఓపెనర్, గబ్బర్ సింగ్ శిఖర్ ధావన్‌పై కేసు నమోదైంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసిలో ఓ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో శిఖర్ ధావన్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ అతడు చేసిన నేరం ఏంటంటే.. పక్షులకు ఆహారం పెట్టడం. వాటిని చేతులతో పట్టుకోవడం.

ఇంకా చదవండి ...
    టీమిండియా ఓపెనర్, గబ్బర్ సింగ్ శిఖర్ ధావన్‌పై ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసిలో ఓ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో శిఖర్ ధావన్ మీద పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చారు. ఇంతకీ అతడు చేసిన నేరం ఏంటంటే.. పక్షులకు ఆహారం పెట్టడం. వాటిని చేతులతో పట్టుకోవడం. ఇటీవల శిఖర్ ధావన్ లక్నోలో పర్యటించాడు. అక్కడ కొన్ని పక్షులకు ఆహారం అందించాడు. వాటికి సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ భయం వెంటాడుతుంటే.. వలస పక్షులకు ఆహారం అందించడం ద్వారా, వాటిని పట్టుకుంటే బర్డ్ ఫ్లూ వ్యాపించే ప్రమాదం పొంచి ఉందని, శిఖర్ ధావన్ అవేవీ పట్టించుకోలేదంటూ వారణాసికి చెందిన ఓ న్యాయవాది కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం టీమిండియా బ్యాట్స్‌మెన్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. కేసు విచారణను ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది. అయితే, ఆ కేసుకి విలువ ఉందా? లేదా అనేది ఆ రోజే తేలనుంది. ఒకవేళ ఆ కేసుకు విలువ ఉందని కోర్టు భావిస్తే ధావన్ ఇబ్బందుల్లో పడడం ఖాయం. సిద్ధార్థ శ్రీవాస్తవ అనే న్యాయవాది ఈ కేసును ఫైల్ చేశారు.

    తన వాదనకు మద్దతుగా సోషల్ మీడియాలో శిఖర్ ధావన్ చేసిన పోస్ట్ ఫొటో, అలాగే, పలు పేపర్లలో వచ్చిన క్లిపింగ్స్‌ను జోడించారు. ఆ ఫొటోలను గమనిస్తే శిఖర్ ధావన్ గంగా నదిలో పడవ మీద కూర్చుని కొన్ని గింజలను చేత్తో పట్టుకున్నాడు. ఆ గింజలను తినేందుకు కొన్ని పక్షులు వస్తున్నాయి. ‘పక్షులకు ఆహారం పెట్టడమే ఆనందం.’ అని కామెంట్ చేశాడు. ఆ ఫొటోలు చాలా అందంగా ఉన్నాయి. చాలా మంది అభిమానులు ధావన్‌ను మెచ్చుకున్నారు. ఆ ఫొటోలకు ఇన్ స్టా గ్రామ్‌లో 4.46 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.




    దేశంలో బర్డ్ ఫ్లూ వైరస్ విజృంభిస్తున్న తరుణంలో వారణాసి జిల్లా అధికారులు కొన్ని కఠిన చర్యలు చేపట్టారు. శిఖర్ ధావన్ ఆ ఆంక్షలను ఉల్లంఘించినట్టు న్యాయవాది శ్రీవాస్తవ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే సమయంలో శిఖర్ ధావన్ కంటే కూడా ఆ బోటు యజమాని మీద కేసు పెట్టాలని సూచించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Bird Flu, Ganga River, Lucknow, Shikhar Dhawan, Uttar pradesh

    తదుపరి వార్తలు